Begin typing your search above and press return to search.

అందుకోస‌మే అయితే పొలం ప‌నులు చేస్తా!

స‌త్య‌దేవ్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మై ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ప్ర‌మోట్ అయిన న‌టుడు. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 Aug 2025 3:00 AM IST
అందుకోస‌మే అయితే పొలం ప‌నులు చేస్తా!
X

స‌త్య‌దేవ్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మై ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ప్ర‌మోట్ అయిన న‌టుడు. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. లెజెండ‌రీ చిరంజీవే స‌త్యదేవ్ న‌ట‌న‌కు ఫిదా అయిన సంద‌ర్బం తెలిసిందే. 'గాడ్ ఫాద‌ర్' లో విల‌న్ పాత్ర‌కు చిరు యువ న‌టుడి ఏరికోరి మ‌రీ తీసుకున్నారు. ఎలాంటి పాత్రైనా అవ‌లీల‌గా పోషించ‌గల న‌టుడు కావ‌డంతో? ఈ త‌ర‌హా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'కింగ్ డ‌మ్'లో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అన్న‌య్య పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. ప్ర‌స్తుతం న‌టుడిగా కొన్ని సినిమా ల‌తో బిజీగా ఉన్నాడు. న‌టుడిగా పారితోషికం కూడా మార్కెట్ ఆధారంగా అందుకుంటున్నాడు. అయితే స‌త్య‌దేవ్ ముందుకు ఓ ఇంట్రెస్టింగ్ క్శ‌శ్చ‌న్ వెళ్లింది. సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణంగా ఫ్యాష‌న్ తోనా? పారితోషికం కోస‌మా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అందుకు స‌త్య‌దేవ్ తాను కేవ‌లం ఫ్యాష‌న్ తో మాత్ర‌మే సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

చెప్పుకోవ‌డానికి సాప్ట్ వేర్ ఉద్యోగం ఉన్నా? మ‌న‌సంతా సినిమాల‌పై ఉండ‌టంతో ఉద్యోగం చేస్తూనే సినిమా ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయిన‌ట్లు తెలిపారు. కేవ‌లం డ‌బ్బు కోస‌మే సినిమాల‌ను అనుకుంటే? త‌న ఊరి వెళ్లి పొలం ప‌నులు చేసుకున్నా డ‌బ్బు వస్తుంద‌న్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చాలా మంది త‌న లాగే ఆలోచిస్తార‌న్నారు. 'డబ్బు కోస‌మేతే ఇంకా చాలా రంగాలున్నాయి. వాటినే ఎంచుకోకుండా ప్ర‌త్యేకించి న‌ట‌నా రంగాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఇక్కడ పేరుతో పాటు డ‌బ్బు కూడా వ‌స్తుంది.

దానికంటే ముందు బాగా క‌ష్ట‌పడాలి. నిజాయితీగా పని చేయాలి. క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తీ ఒక్క‌రూ స‌క్సెస్ అవుతార‌ని లేదు. దానికి అదృష్టం కూడా క‌లిసి రావాల‌న్నారు. అయితే ప‌రిశ్ర‌మ‌కు మ‌నీ టార్గెట్ గా వ‌చ్చిన‌ట్లు ఓ సంద‌ర్బంలో న‌టుడు శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. తన ద‌గ్గ‌ర డ‌బ్బు లేక‌పోవ‌డంతో కేవ‌లం డ‌బ్బులు సంపాదించ‌డం కోస‌మే సినిమాల్లోకి వ‌చ్చాన‌ని...అంత‌కు మించి మ‌రో ఆలోచ‌న లేద‌న్నారు. అదే డ‌బ్బు త‌న ద‌గ్గ‌ర ఉంటే సొంత ఊరిలో సంతోషంగా ఉండేవాడిన‌న్నారు.