Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం… నాని నుంచి మరో డిఫరెంట్ మూవీ

ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది… ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అని అందరూ చెప్పే సామెతని కాన్సెప్ట్ గా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 7:14 AM GMT
సరిపోదా శనివారం… నాని నుంచి మరో డిఫరెంట్ మూవీ
X

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కొత్త కథలు చెప్పడానికి దర్శకులకి అవకాశం ఇస్తున్నాడు. ఈ ఓ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో మూవీస్ చేస్తూనే మరో వైపు మాస్ ఆడియన్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దసరాతో ఈ ఏడాది కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని నాని అందుకున్నాడు.

హాయ్ నాన్నతో తండ్రి, కూతుళ్ళ అనుబంధాన్ని తెరపై చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేశాడు. తాజాగా ఇంటరెస్టింగ్ గ్లింప్స్ తో ఈ సినిమా టైటిల్ ని ఎనౌన్స్ చేశారు. అలాగే కాన్సెప్ట్ ని కూడా ఈ గ్లింప్స్ తో చెప్పేశారు.

గ్లింప్స్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది… ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అని అందరూ చెప్పే సామెతని కాన్సెప్ట్ గా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తోంది. సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో స్టొరీ ఇంటెన్షన్ ని చెప్పించి ఓ షెడ్ లో చైన్ తో బంధించి ఉన్న నానిని చూపించారు.

ఈ సినిమాలో హీరో ప్రతి వారం తనకంటూ ఒక రోజు వస్తుంది. అది శనివారం. ఆ శనివారం హీరో ఏం చేస్తాడు అనే యాంగిల్ లో నాని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సరిపోదా శనివారం అనే టైటిల్ ని మూవీకి పెట్టినట్లు చూపించారు. నాని చైన్ ని బ్రేక్ చేసుకొని తన కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ఆ షెడ్ లోంచి వస్తాడు.

అతని రావడం చూసిన అందరూ సంతోషిస్తారు. గ్లింప్స్ చూస్తుంటే యాక్షన్ మూవీ ఎలివేషన్ అయితే ఇచ్చారు. కాని వివేక్ ఆత్రేయ అంటేనే జంద్యాల స్టైల్ లో సాగే ప్లెజెంట్ కామెడీతో ఉంటుందని గత మూడు సినిమాలు చూపించాయి. టైటిల్ చూస్తుంటే కాస్తా వెరైటీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంది. సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా నటించగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.