Begin typing your search above and press return to search.

ప్రధాని పాత్ర విషయమై కట్టప్ప క్లారిటీ

బాహుబలి నటుడు కట్టప్ప ను మోదీ బయోపిక్‌ కు సంప్రదించారని కూడా ప్రధాన మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయి.

By:  Tupaki Desk   |   22 May 2024 11:12 AM GMT
ప్రధాని పాత్ర విషయమై కట్టప్ప క్లారిటీ
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం దక్కించుకోబోతున్నాడు అంటూ వార్తలు ఏ స్థాయిలో వస్తున్నాయో అదే స్థాయిలో ఆయన బయోపిక్ ను తమిళ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

బాహుబలి నటుడు కట్టప్ప ను మోదీ బయోపిక్‌ కు సంప్రదించారని కూడా ప్రధాన మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయి. దాంతో మోదీ అభిమానులు ఎప్పుడెప్పుడు సత్యరాజ్ నటించబోతున్న బయోపిక్‌ ను చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.

మీడియాలో ప్రధానంగా వస్తున్న వార్తలు చూసి చాలా మంది సత్యరాజ్ ను సంప్రదించారట. దాంతో ఆయనే స్వయంగా మీడియా కు క్లారిటీ ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ యొక్క బయోపిక్‌ కోసం ఇప్పటి వరకు నన్ను ఎవరు కూడా సంప్రదించలేదు అంటూ కుండ బద్దలు కొట్టాడు.

ఈ మధ్య కాలంలో నన్ను మోదీ సినిమా గురించి ఎవరు కూడా అడగలేదు. ఈ వార్తలు చూసి నేను ఆశ్చర్య పోయాను. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి అంటూ షాక్ అయ్యాను అన్నాడు. మోదీ బయోపిక్ మాత్రమే కాకుండా ఏ ఒక్కరి బయోపిక్ కు కూడా నేను ఓకే చెప్పను.

అసలు నేను బయోపిక్ లకు వ్యతిరేకం. అందుకే నేను ముందు ముందు కూడా బయోపిక్ లో నటించను అంటూ క్లారిటీ ఇచ్చాడు. మోదీ వంటి దేశ్ కి నేత బయోపిక్ లో కూడా నేను నటించేందుకు సిద్ధంగా లేను అన్నట్లుగా సత్యరాజ్ ప్రకటించి గత వారం రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్‌ పెట్టాడు.