Begin typing your search above and press return to search.

శశివదనే టీజర్.. గోదావరిలో ఏమోషనల్ లవ్

ఇక సినిమా ప్రమోషన్స్ హడావుడి స్టార్ట్ చేసిన యూనిట్ టీజర్‌ ను విడుదల చేశారు. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ టీజర్‌లో లీడ్ పెయిర్ అయిన రక్షిత్ అట్లూరి కోమలి అందమైన ప్రేమికులుగా కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:19 PM GMT
శశివదనే టీజర్.. గోదావరిలో ఏమోషనల్ లవ్
X

లండన్ బాబులు, పలాస 1978 వంటి డిఫరెంట్ సినిమాలు చేసిన రక్షిత్ అట్లూరి నెక్స్ట్ మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్నాడు. 'శశివదనే' అనే సినిమా టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ నటుడు ఇప్పుడు టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గోదావరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ విజువల్స్ తోనే గోదావరి అందాలను హైలెట్ చేశారు.

గౌరీ నాయుడు సమర్పణలో SVS కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, AG ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. ఇక ప్రవీణ్ యెండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్ జబర్దస్త్ బాబీ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక రక్షిత్ అట్లూరి జోడిగా కోమలీ నటిస్తోంది. సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సినిమా ప్రమోషన్స్ హడావుడి స్టార్ట్ చేసిన యూనిట్ టీజర్‌ ను విడుదల చేశారు. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ టీజర్‌లో లీడ్ పెయిర్ అయిన రక్షిత్ అట్లూరి కోమలి అందమైన ప్రేమికులుగా కనిపిస్తున్నారు. "గడిచే కాలంతో ఈ నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇక పై నీతోనే" అనే డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇక టీజర్ లో అనుదీప్ అందించిన నేపథ్య సంగీతం మరింత హైలెట్ అయ్యింది.

ఇక సినిమా పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథ అని కొన్ని సీన్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక కాన్సెప్ట్ టీజర్‌ లోని ఇంపాక్ట్‌ ఫుల్ డైలాగ్‌ లు రొమాంటిక్ డైలాగ్‌ లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. యూనిక్ కాన్సెప్ట్‌ తో ఫ్రెష్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందనే నిర్మాతలు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా విజువల్స్ అయితే బాగున్నాయి. అలాగే రొమాంటిక్ ప్రేమ కథలో బావోద్వేగమైన సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిత్ నమ్ముతోంది. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.