Begin typing your search above and press return to search.

మాజీ CM మ‌న‌వ‌రాలు సూప‌ర్‌ హాట్ గురూ!

శార్వరీ వాఘ్ .. న‌టి కం ఫ్యాష‌నిస్టా. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఇప్ప‌టికే పేరు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 8:03 AM IST
మాజీ CM మ‌న‌వ‌రాలు సూప‌ర్‌ హాట్ గురూ!
X
శార్వరీ వాఘ్ .. న‌టి కం ఫ్యాష‌నిస్టా. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఇప్ప‌టికే పేరు తెచ్చుకుంది. అలాగే నేటితరం ఫ్యాష‌నిస్టాల్లో శార్వారి తన ఫ్యాషన్ ఎంపికలతో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలుస్తోంది. రెడ్ కార్పెట్‌పై సొగసైన ప్రదర్శనలైనా లేదా ఎయిర్‌పోర్ట్ లుక్ లో అయినా ప్రతిసారీ షో స్టాప‌ర్ గా పరిపూర్ణతతో ఆకర్షిస్తుంది. శార్వరి వాఘ్ ఇటీవ‌ల‌ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో మరోసారి అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంది.

YRF `బంటీ ఔర్ బబ్లీ`తో శర్వరీ వాఘ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఈ బ్యూటీ కొత్త బాబ్లీగా కనిపించింది. గల్లీ బాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించింది. సూపర్ స్టార్లు రాణి ముఖర్జీ - సైఫ్ అలీ ఖాన్‌లతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. త‌న మొద‌టి సినిమా ప్రివ్యూ స‌మ‌యంలో త‌న త‌ల్లి సోద‌రి క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ని, కామెడి చిత్ర‌మే అయినా వారు త‌న‌ను తొలిసారి తెర‌పై చూసి ఎమోష‌న‌ల్ అయ్యార‌ని శార్వ‌రి తెలిపింది. ఏడేళ్ల క‌ల ఫ‌లించి చివ‌రికి న‌టిని అయ్యాన‌ని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి న‌టిగా మారిన శార్వ‌రి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ నాయిక‌గా కొన‌సాగుతోంది.

అయితే శార్వ‌రి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే ఎంతో ఆస‌క్తిక‌రం:

1. శార్వరి వాఘ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మనవరాలు.

2. ఆమె తన కళాశాల విద్యను ముంబై విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది.

3. శార్వ‌రి వ్యాపార కుటుంబానికి చెందినది.

4. ప్యార్ కా పంచనామా 2, బాజీరావ్ మస్తానీ, సోను కే టిటు కి స్వీటీ వంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది.

5. ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే అనే వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.

6. 14 జూన్, 1996న ముంబైలో జన్మించింది.

7. మోడల్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు శార్వ‌రి వయస్సు 16 సంవత్సరాలు.

8. ఆమె తన ది ఫర్గాటెన్ ఆర్మీ సహనటుడు సన్నీ కౌశల్‌తో డేటింగ్ చేస్తోంది. సన్నీ కౌశల్ బాలీవుడ్ నటుడు, విక్కీ కౌశల్ సోదరుడు.

9. ఆమె జంతు ప్రేమికురాలు.. కుక్కలంటే చాలా ఇష్టం.

10. శార్వ‌రి చిన్నప్పటి నుండి సంగీత ప్రియురాలు. నేను నా గదిలో కూర్చుని పాత క్యాసెట్లను ప్లే చేస్తాను.. ఆపై CD లలో ... నా MP3 ప్లేయర్‌లో ప్లే చేస్తాను. నేను ఎప్పుడూ ఏదో ఒక రకమైన సంగీతాన్ని వింటాను. పనిలేకుండా కూర్చున్నప్పుడు దానిని వింటాను.. అని తెలిపింది.

11. ఆమె తండ్రి బిల్డర్. తల్లి సోదరి వాస్తుశిల్పులు. తనకు సివిల్ ఇంజనీర్ కావాలనే కోరిక ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శార్వ‌రి మాట్లాడుతూ, ``నేను సైన్స్ విద్యార్థిని, 11వ తరగతి చదువుతున్నప్పుడు `ఫ్రెష్ ఫేస్` అనే ఈ పోటీ జరిగింది. నేను విజయం సాధించాను. ఈ పోటీ ఏమిటో కూడా నాకు తెలియదు.. అని తెలిపింది.

12. ఒక‌ ఇంటర్వ్యూలో 2014లో తన మొదటి ఆడిషన్ కి వెళ్లాన‌ని తెలిపింది. ఈ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరూ తమ సొంత కష్టాలను ఎదుర్కొంటున్నారని నేను భావిస్తున్నాను. పనిని పొందడం ఖచ్చితంగా పెద్ద పోరాటం. ఇది కూడా మీకు చాలా నేర్పుతుంది. ఈ 5-6 సంవత్సరాలలో నేను కష్టపడి గడిపిన కాలం చాలా నేర్పింది. ఇక న‌ట‌ ప్రదర్శన ద్వారా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి... అని తెలిపింది.