Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. నాని జెట్ స్పీడ్..

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ను మేకర్స్ చిత్రీకరించనున్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 1:30 AM GMT
సరిపోదా శనివారం.. నాని జెట్ స్పీడ్..
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీకి ఓకే చెప్పేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో దసరా మూవీతో హిట్ కొట్టిన నాని.. ఇటీవలే హాయ్ నాన్నతో పలకరించారు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఆయన మరోసారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపారు. గతంలో వీరిద్దరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన అంటే సుందరానికి ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ మూవీలో నానిని వివేక్ ఆత్రేయ కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్ లో చూపించబోతున్నారు

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ను మేకర్స్ చిత్రీకరించనున్నారు. నానితోపాటు ఇతర నటీనటులు ఈ షూటింగ్‌ షెడ్యూల్ లో పాల్గొంటారు.

కొద్ది రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన అన్‌ చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ చెయిన్డ్ వీడియో చూసి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్.. రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే పుష్ప 2 రిలీజైన రెండు వారాలకు నాని సరిపోదా శనివారం మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మరోసారి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.