Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం బడ్జెట్.. ఇది టూ మచ్?

నిర్మాత దానయ్య దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారు అని కథనాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 March 2024 3:56 AM GMT
సరిపోదా శనివారం బడ్జెట్.. ఇది టూ మచ్?
X

నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలతో అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా నాని మెప్పించి మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఈ మూవీలో నానికి జోడీగా నటిస్తోంది. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. వారం రోజుల కోపాన్ని ఒక రోజు మాత్రమే చూపించే వ్యక్తిగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ ఉండబోతోంది. వివేక్ ఆత్రేయ మొదటి మూడు సినిమాలు క్లాస్ టచ్ లో చేసి మెప్పిస్తే ఈ సారి మాస్ అండ్ యాక్షన్ జోనర్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు.

నాని సక్సెస్ ట్రాక్ కారణంగా సరిపోదా శనివారం సినిమా బిజినెస్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం రకరకాల కథనాలు వస్తున్నాయి. నిర్మాత దానయ్య దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారు అని కథనాలు వెలువడుతున్నాయి. యాక్షన్ సీన్స్ హెవీగా ఉండేలా ప్లాన్ చేయడంతో దానికే ఎక్కువ బడ్జెట్ అయినట్లు టాక్ గట్టిగానే వస్తోంది.

అయితే నిజానికి ఆ రేంజ్ లో ఖర్చు చేయలేదమి ఇన్ సైడ్ టాక్. దానయ్య పక్కా లెక్కతో 60 కోట్ల లోపే సినిమాను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. దానయ్య డిమాండ్ కు తగ్గట్టుగా థియేట్రికల్ రైట్స్ లో అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, మాస్ ఎలివేషన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయంట. ఈ సినిమాతో దసరా కలెక్షన్స్ ని నాని బీట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే కచ్చితంగా నాని మార్కెట్ వేల్యూ కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు ఈ డైరెక్టర్ తో నాని చేసిన అంటే.. సుందరానికి అనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేయలేకపోయింది. టాక్ బాగుంటేనే బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా నష్టాలు కూడా హై రేంజ్ లోనే ఉంటాయి.

దసరా, హాయ్ నాన్న సినిమాని నాని పాన్ ఇండియా మూవీస్ గానే రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు తెలుగులో తప్ప ఇతర భాషలలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సరిపోదా శనివారం సినిమా కూడా పాన్ ఇండియా బ్రాండ్ తో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ అయిన అతనికి ఇతర భాషలలో మార్కెట్ కి డోర్స్ ఓపెన్ చేస్తుందేమో చూడాలి.