Begin typing your search above and press return to search.

ప్లానింగ్ అంటే నానిదే.. ఈసారి మరో లెవెల్..!

ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాని. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:09 AM GMT
ప్లానింగ్ అంటే నానిదే.. ఈసారి మరో లెవెల్..!
X

న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది మార్చిలో దసరా అంటూ దుమ్ము దులిపే హిట్ అందుకున్నాడు. తనని తాను స్టార్ గ ప్రూవ్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న నాని దసరాతో 100 కోట్ల కలని కూడా నిజం చేసుకున్నాడు. దసరా ఇచ్చిన బూస్టింగ్ తో తన కెరీర్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో హాయ్ నాన్న సినిమాతో రాబోతున్నాడు నాని. నాని మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ లాక్ చేశారు.

ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాని. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం అంటూ టీజర్ తోనే సర్ ప్రైజ్ చేశాడు నాని. దసరాతో తను కూడా మాస్ సినిమాలు చేయగలనని ప్రూవ్ చేసిన నాని వెంటనే హాయ్ నాన్న అంటూ మళ్లీ తన మార్క్ ఎమోషనల్ మూవీ చేస్తున్నాడు. ఆ వెంటనే వివేక్ తో మళ్లీ మాస్ సినిమా చేస్తున్నాడు.

సరిపోదా శనివారం అదేంటో టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు వివేక్. వివేక్ ఇదివరకు చేసిన 3 సినిమాలకు భిన్నంగా ఈసారి కమర్షియల్ ఫార్మెట్ లో ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతుంది. వివేక్ ఆత్రేయ నాని కాంబోలో వస్తున్న ఈ సెకండ్ మూవీ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. దసరా తర్వాత సినిమాల విషయంలో తన పంథా మార్చేసిన నాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు.

దసరా తర్వాత హాయ్ నాన్న కూల్ అండ్ ఎమోషనల్ మూవీగా వస్తుండగా మళ్లీ దసరా టైప్ లో మరో మాస్ సినిమాగా సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సో ఈ లెక్కన నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ పైన కన్నేశాడని చెప్పొచ్చు. సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా ఎస్.జె సూర్య నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ సెలెక్ట్ అయ్యింది. సో మొత్తానికి నాని ఈసారి పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగుతున్నాడని అనిపిస్తుంది. మరి న్యాచురల్ స్టార్ ప్లానింగ్ ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అన్నది చూడాలి. హాయ్ నాన్న డిసెంబర్ లో వస్తుండగా సరిపోదా శనివారం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది.