Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం గ్లింప్స్.. హీరో కోపం ఒక్కరోజే..

నిర్మాత DVV దానయ్యకు బిజినెస్ పరంగా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:49 AM GMT
సరిపోదా శనివారం గ్లింప్స్.. హీరో కోపం ఒక్కరోజే..
X

నేచురల్ స్టార్ నాని యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రాబోతున్న మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. నిర్మాత DVV దానయ్యకు బిజినెస్ పరంగా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే..సూర్య వాయిస్ ఓవర్ తో హీరో క్యారెక్టర్ సూర్య గురించి పరిచయం చేసిన విధానం చాలా హైలెట్ గా నిలిచింది. 'కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా.. నేను చూశాను.. అంటూ సూర్య వాయిస్ ఓవర్ ఇస్తుండగా హీరో నాని క్యారెక్టర్ యాక్షన్ మోడ్ లో పరిచయమవుతుంది.

చూస్తుంటే సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నాని నుంచి ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమా రాబోతోందని మొదటి గ్లింప్స్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. అతని పేరు సూర్య.. రోజు శనివారం.. అని మరొక డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేయగా రిక్షా తొక్కుకుంటూ వెనకాల ఒక వృద్ధుడికి కళ్ళజోడు పెట్టించి మరి తీసుకువచ్చే విధానం చూస్తూ ఉంటే అతని క్యారెక్టర్ లో చాలా రకాల షేడ్స్ ఉన్నాయి అని అనిపిస్తోంది.

ఒకవైపు మంచితనం మరొకవైపు కోపంతో ఉండే క్యారెక్టర్ తో నాని సినిమాలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సరిపోదా శనివారం టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్ హైలెట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్ జై సూర్య కనిపించబోతున్న విషయం తెలిసిందే. అతను గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఇచ్చిన డైలాగ్ మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది.

అలాంటి పవర్ఫుల్ విలన్ కు హీరో ఏ విధంగా ఎదురు వెళతాడు అనేది ఈ సినిమాలో మంచి కిక్ ఇచ్చే అంశం. చూడాలి మరి దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువస్తాడో. ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా జేక్స్ బిజొయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో కూడా మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గ్లింప్స్ లో హైలెట్ చేశారు.