Begin typing your search above and press return to search.

కార్తీ హిట్ సినిమాకు సీక్వెల్.. ఈ సారి అంతకు మించి

అలాగే పార్ట్ 2లో కూడా కార్తి రెండు పాత్రల లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒకటి రా ఏజెంట్ పాత్ర అయితే మరొకటి పోలీస్ ఆఫీసర్ రోల్.

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:03 AM GMT
కార్తీ హిట్ సినిమాకు సీక్వెల్.. ఈ సారి అంతకు మించి
X

కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సర్దార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కార్తి ఈ చిత్రం లో డ్యూయల్ రోల్ లో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కార్తి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం లో కార్తి ఒక క్యారెక్టర్ లో ఇండియన్ రా ఏజెంట్ గా కనిపిస్తాడు. అలాగే వాటర్ బాటిల్స్ వెనుక ఉన్న స్కామ్ గురించి చిత్రం లో చర్చించారు.

రాశిఖన్నా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సర్దార్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సర్దార్ 2 టైటిల్ తోనే ఈ సీక్వెల్ ఉంటుందంట. అలాగే పార్ట్ 2లో కూడా కార్తి రెండు పాత్రల లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒకటి రా ఏజెంట్ పాత్ర అయితే మరొకటి పోలీస్ ఆఫీసర్ రోల్. అయితే ఈ కొనసాగింపులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందంట.

అలాగే సర్దార్ క్యారెక్టర్ ని కూడా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిత్రన్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఫైనల్ వెర్షన్ రాసే పనిలో ఉన్నారంట. ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కార్తి జపాన్ అనే సినిమా చేస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. జపాన్ రిలీజ్ తర్వాత సర్దార్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందని టాక్.

ఇక సర్దార్ 2 కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ కుమార్ స్థానం లో యువన్ శంకర్ రాజాని ఖరారు చేసుకున్నారంట. మిత్రన్, యువన్ శంకర్ రాజా కాంబినేషన్ లో ఇప్పటికే శివకార్తికేయన్, విశాల్ హీరోలుగా రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో సర్దార్ 2 మూడో సినిమా అవుతుంది.

ఇక రాశిఖన్నా కూడా ఈ చిత్రం లో ఉండే ఛాన్స్ ఉంది. ఆమె కాకుండా మిగిలిన క్యాస్టింగ్ ఎవరనేది త్వరలో ఎనౌన్స్ చేయనున్నారంట. మరి సర్దార్ తరహాలో ఈ సీక్వెల్ కూడా సూపర్ సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.