Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్లో కార్తీ పెర్మార్మెన్స్ పీక్స్ లో!

కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌ర్దార్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచింది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:30 AM
ఆ సీక్వెల్లో కార్తీ పెర్మార్మెన్స్ పీక్స్ లో!
X

కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌ర్దార్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచింది. త‌మిళ్‌, తెలుగులో రిలీజ్ అయిన సినిమా మంచి విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. మూడున్న‌రేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ కూడా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగాన్ని తెర‌కెక్కించిన మిత్ర‌న్ రెండ‌వ భాగాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

కొన్ని నెల‌లుగా సెట్స్ లో ఉన్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్తీ డ్యూయెల్ రోల్ య‌దావిధిగా సీక్వెల్ లో కూడా కంటున్యూ అవుతుంది. ఇందులోనూ తండ్రీ కొడుకులుగా క‌నిపించ నున్నారు. అయితే సీక్వెల్ లో మ‌రింత ప‌వ‌ర్ పుల్ గా ఆ పాత్ర‌లు డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే ప‌రుగులు పెట్టిస్తుందిట‌. చిత్రీక‌ర‌ణ పాకిస్తాన్-బార‌త్ ఎగ్జోటిక్ లోకేష‌న్స్ లో చేసిన‌ట్లు స‌మాచారం.

రా అధికారికి సంబంధించిన స‌న్నివేశాలు రా అండ్ ర‌స్టిక్ గా ఉంటాయ‌ట‌. కార్తీ రియ‌లిస్టిక్ పెర్పార్మెన్స్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి కార్తీ కొంత మంది మాజీ రా అధికారుల‌ను క‌లిసి వాళ్ల పాత్ర‌ల్లో ఆత్మ‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసాడుట‌. శత్రువుల చేతుల్లో బంధీలుగా మారిన స‌మ‌యంలో ఎదుర‌య్యే క‌ఠిన ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేక అవ‌గాహ‌న తెచ్చుకుని న‌టించిన‌ట్లు చెబుతున్నారు.

ఇలాంటి పాత్ర‌లు త‌గిలితే కార్తీ చెల‌రేగిపోతాడు. `ఖాకీ` చిత్రంలో కార్తీ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన ఆ సినిమా ఓ ఎత్తైతే? అందులో కార్తీ న‌ట‌న మ‌రో ఎత్తు. అందుకే కాప్ , స్పై థ్రిల్ల‌ర్లు కార్తీకి ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతుంటాయి. స‌ర్దార్ 2కి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి ఏడాది చివ‌ర్లో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.