Begin typing your search above and press return to search.

సీక్వెల్ తో భారీ టార్గెట్ పెట్టుకున్న స్టార్..!

ఏ భాషలో వచ్చిన సినిమా అయినా సరే సీక్వెల్ అనౌన్స్ మెంట్ చేస్తే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 May 2025 1:30 AM
సీక్వెల్ తో భారీ టార్గెట్ పెట్టుకున్న స్టార్..!
X

ఏ భాషలో వచ్చిన సినిమా అయినా సరే సీక్వెల్ అనౌన్స్ మెంట్ చేస్తే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కొన్ని సినిమాలు సీక్వెల్ ముందే ప్లాన్ చేసుకుని తీస్తుంటారు. కానీ కొన్ని కథలు మాత్రం అలా కాకుండా ఒక కథకు ముగింపు ఇచ్చేసి దానికి సీక్వెల్ గా మరో కొత్త కథ మొదలు పెడతారు. హిట్ సీరీస్ లు ఇలాంటి అటెంప్ట్ లతోనే వరుస సక్సెస్ లు అందుకుంటున్నాయి. కథని కొనసాగిస్తూ రెండు మూడు భాగాలు తీయడం ఒక లెక్క అయితే. ఒక కథ అందులోని పాత్రలు ఆడియన్స్ కి నచ్చినప్పుడు అదే క్యారెక్టరైజేషన్ తో మరో కొత్త కథతో రావడం మరో పద్ధతి.

ఇలాంటి ప్రయత్నాలు కోలీవుడ్ లో కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2022 లో వచ్చిన సర్దార్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ని తీస్తున్నారు. కార్తి హీరోగా పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్దార్ తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. కార్తి స్టోరీ సెలక్షన్ పి.ఎస్ మిత్రన్ కథ కన్విక్షన్ అంతా కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. సర్దార్ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్ ప్రకటించారు.

సర్దార్ 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఐతే సర్దార్ 1 అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది కాబట్టి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ సక్సెస్ అందుకుంది. ఐతే సర్దార్ 2 మీద ఎలా లేదన్నా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టు ఉండాలి. ఐతే హీరో కార్తీ మాత్రం సర్దార్ 2 తో భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది.

ఈమధ్యనే హిట్ 3 లో క్యామియో ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన కార్తి హిట్ 4 కి సైన్ చేశాడని తెలుస్తుంది. రాబోతున్న సర్దార్ 2 తమిళ్ లోనే కాదు తెలుగు లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా కార్తి పి.ఎస్ మిత్రన్ కాంబో లో వస్తున్న ఈ సర్దార్ 2 మరో సెన్సేషన్ సృష్టించాలని కోరుతున్నారు. కార్తి సర్దార్ 2 ని అసలైతే మే 30న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమా ఇంకా పూర్తి అవ్వకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది.