Begin typing your search above and press return to search.

విచిత్రమైన చీర కట్టులో వయ్యారాలు ఒలకబోత

ఇలాంటి చీర కట్టు కూడా ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూనే వావ్‌ అంటూ ఆమె ఫోటో షూట్‌ ను అభినందిస్తూ షేర్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 8:06 AM GMT
విచిత్రమైన చీర కట్టులో వయ్యారాలు ఒలకబోత
X

బాలీవుడ్ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోయే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు ఇంకా సిరీస్‌ ల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌ గా బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత కంటిన్యూ చేస్తూ ఉంది.


తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ కోసం సారా అలీ ఖాన్‌ కవర్ పేజీ ఫోటో షేర్‌ చేసింది. విచిత్రమైన చీర కట్టులో ఈ అమ్మడు కన్నుల విందు చేసింది. ఇలాంటి చీర కట్టు కూడా ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూనే వావ్‌ అంటూ ఆమె ఫోటో షూట్‌ ను అభినందిస్తూ షేర్‌ చేస్తున్నారు.

నడుము నాభి అందాన్ని చూపించడంతో పాటు చేతులు పైకి ఎత్తి ఒయ్యారాలు పోతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం తెగ సందడి చేస్తున్నాయి. ఈ అమ్మడు గతం లో చాలా లావుగా ఉండేది. హీరోయిన్‌ అవ్వాలనే పట్టుదలతో దాదాపుగా ముప్పై నుండి నలబై కేజీల బరువు తగ్గింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇక సారా అలీ ఖాన్‌ సినిమాల విషయానికి వస్తే... 'ఏ వతన్ మేరే వతన్' సినిమా లో నటిస్తోంది. మెట్రో డినోలో.. మరో రెండు ప్రాజెక్ట్‌ ల్లో కూడా ఈమె నటిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సారా అలీ ఖాన్ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది కూడా ఈమె నుంచి నాలుగు అయిదు సినిమాలు రావచ్చు.