శంకర్ ట్రెండ్ సెట్టర్ మిస్సయాడట!
బ్లాక్ బస్టర్ మూవీస్, కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లిన సందర్భాలు కోలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలలో కోకొల్లలు.
By: Ravindar Gorantla | 6 March 2026 1:00 AM ISTబ్లాక్ బస్టర్ మూవీస్, కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లిన సందర్భాలు కోలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలలో కోకొల్లలు. ఒక హీరో చేయాల్సిన కెరీర్ టర్నింగ్ బ్లాక్ బస్టర్స్‌ని మరో హీరో చేసి టాప్ లోకి వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి క్రేజీ ఆఫర్లని పరిస్థితుల కారణంగా వదలుకుని ఇప్పటికీ బాధపడుతున్న స్టార్స్ ఎందరో ఉన్నారు. అలా కెరీర్‌లో చిరస్థాయిగా చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ మూవీ `జెంటిల్‌మెన్`. 1993లో శంకర్‌గా పరిచయమై సంచలనం సృష్టించిన సినిమా ఇది.
భారీ చిత్రాల నిర్మాత కె.టి.కుంజుమోన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించి ఔరా అనిపించారు. దర్శకుడిగా శంకర్, హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్‌ల కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని అర్జున్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల పరంగానూ రికార్డు స్థాయి వసూళ్లని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని శంకర్ ముందు డా.రాజశేఖర్‌తో చేయాలని ప్లాన్ చేశాడు.
అప్పటికి శంకర్ కొత్త దర్శకుడు కావడం, రాజశేఖర్ డేట్స్ కుదరకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజశేఖర్. ఆ తరువాత శంకర్ అప్పటికే హీరోగా వరుస యాక్షన్ ఎంటర్‌టైనర్స్ మండే సూర్యుడు, ఇదుదాండా సట్టం, ఆదిత్యన్, ఐ లవ్ ఇండియా వంటి లతో బిజీబిజీగా ఉన్నాడు. అదే టైమ్‌లో శంకర్ తనకు `జెంటిల్‌మెన్` స్టోరీ చెప్పి ఒప్పించాడట. దీనికి కె.టి.కుంజుమోన్, దర్శకుడు పవిత్రన్ నిర్మాతలు. అంతా ఓకే అనుకుని ఫోటో షూట్ కూడా పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టారు.
ఐదు రోజులు షూటింగ్ కూడా చేశారట. ఆ తరువాతే నిర్మాతలు కె.టి.కుంజుమోన్, పవిత్రన్‌ల మధ్య అభిప్రాయబేధాలొచ్చారట. ఫలితం సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. దీంతో సినిమా నుంచి తప్పుకున్నాడట శరత్‌కుమార్. రీసెంట్‌గా ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ శరత్ కుమార్ `జెంటిల్‌మెన్` ఎలా మిస్ చేసుకున్నారో వివరించారు. `జెంటిల్‌మెన్ కోసం దర్శకుడు శంకర్ ముందు నన్నే సంప్రదించారు. ఫొటోషూట్ కూడా చేశాం. ఫైనల్‌గా షూటింగ్ మొదలు పెట్టాం.
ఐదు రోజులు షూటింగ్ చేశాక ప్రొడ్యూసర్స్ కె.టి.కుంజుమోన్, పవిత్రన్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ మూవీ ముందుకువెళ్లదని గమనించి నేనే తప్పుకున్నాను. అది నేను చేసిన బిగ్ మిస్టేక్` అంటూ తను మిస్ చేసుకున్న కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గురించి చెప్పి ఫీలయ్యారు. ఇదిలా ఉంటే శరత్‌కుమార్ ప్రస్తుతం హీరోయిన్ ఫాదర్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. గత ఏడాది ప్రదీప్ రంగనాథన్, మమితాబైజు నటించిన `డ్యూడ్`మూవీలో హీరోయిన్ ఫాదర్‌గా నటించిన విషయం తెలిసిందే.
