అమ్మ జ్ఞాపకంతో శరత్ కుమార్ కన్నీటి పర్యంతం!
అమ్మ కష్టం తెలిసినా? తలుచుకున్నా? కొడుకు గా నేనేం చేసాను అనే బాధ కొందరు కొడుకుల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.
By: Tupaki Desk | 2 July 2025 1:22 PM ISTస్త్రీ లేనిదే సృష్టిలేదు. అమ్మ ప్రేమ అమూల్యమైనది. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం, ఓదార్పు, అంకితభావం అన్నీ ఒకరిలో కలిస్తే అది అమ్మ. అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనది. అమ్మ అంటే జీవితంలో వెలుగు, ఆనందం, భరోసా. అందుకే అమ్మ ఓ గొప్ప జ్ఞాపకం. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పి నా తక్కువే. అలాంటి అమ్మ కష్టపడితే తట్టుకోలేని కొడుకులు ఎంతో మంది.
అమ్మ కష్టం తెలిసినా? తలుచుకున్నా? కొడుకు గా నేనేం చేసాను అనే బాధ కొందరు కొడుకుల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి బాధనే కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వ్యక్తం చేసారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిన్నప్పుడు తన తల్లికి ఎదురైనా కొన్ని అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. శరత్ కుమార్ మధ్య తరగతి కుటుంబం. ఐదారు వేల తో కుటుంబం జీవించేది.
కానీ వాళ్ల బంధువులంతా బాగా ధనవంతులట. వాళ్ల ఇంటికి తన తల్లి వెళ్లినప్పుడు వంట చేయమని చెప్పే వారట. తన తల్లి మంచి కుక్ అని..20-30 మందికి వంటలు చేసేవారట. బంధువులు ఇంటికి వెళ్లినప్పుడల్లా అమ్మ అలా అందరికీ వంట చేసేవారట. అదే తన తల్లి ని ఓ ఫారిన్ కారులో అదే ఇంటికి తీసుకెళ్తే వంట చేయమనే వారు కాదు? కదా అని ఆ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
అప్పుడే తన దగ్గర అంత డబ్బు ఉంటే ఆ రోజు అమ్మకు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదాని అని అన్నారు. అమ్మ గురించి శరత్ కుమార్ అలా చెప్పగానే సిద్దార్ద్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఎంతో వ్యక్తిగత విషయాన్ని ఇంత ఓపెన్ గా చెప్పడం గొప్పగా భావిస్తున్నట్లు సిద్దార్ధ్ చప్పట్లతో అభినందించాడు.
