Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : హీరోయిన్స్ సైతం నీ ముందు దిగదుడుపు

సోషల్‌ మీడియాలో హీరోయిన్స్‌, మోడల్స్ అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:54 AM GMT
పిక్ టాక్ : హీరోయిన్స్ సైతం నీ ముందు దిగదుడుపు
X

సోషల్‌ మీడియాలో హీరోయిన్స్‌, మోడల్స్ అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఇండస్ట్రీతో పెద్దగా సంబంధం లేని వారు కూడా అప్పుడప్పుడు ఇలా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ తాము హీరోయిన్స్ కంటే తక్కువేం కాదు అన్నట్లుగా నెటిజన్స్‌ తో అనిపించుకుంటూ ఉంటారు.


తాజాగా క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హీరోయిన్స్ కంటే సారా నే బాగుంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాతికేళ్ల వయసు దాటిన సారా టెండూల్కర్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు.

ఇలాంటి ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండటం వల్ల ఇన్‌ స్టా లో సారా కి ఏకంగా ఆరు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ అయ్యారు. ఆమె యొక్క అందం కు హీరోయిన్స్‌ ని మించిన అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది.

ఆ మధ్య ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. క్రికెటర్ తో ఈమె చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీడియో లు మరియు ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆ విషయాలు ఏవీ కూడా బయటకు రావడం లేదు.

తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోల్లో బ్యూటీఫుల్‌ ఔట్ ఫిట్‌ లో క్లీ వేజ్ షో చేస్తూ హీరోయిన్ కి మించి అందమైన ఫోజ్ ఇచ్చిన సారా కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్ మరియు షేర్స్ దక్కుతున్నాయి.