Begin typing your search above and press return to search.

చెడు చేసే వాళ్ల‌ని క‌ర్మ చూసుకుంటుంది!

నేను క‌ర్మ‌ని న‌మ్ముతాను. చెడు చేసేవాళ్లకి క‌ర్మ చూసుకుంటుంది. నా చుట్టూ ఉంటూ నాతో ఇన్ని సంవ‌త్స‌రాలు ఉండి నాకే ద్రోహం చేశారు.

By:  Ravindar Gorantla   |   7 March 2026 4:19 PM IST
చెడు చేసే వాళ్ల‌ని క‌ర్మ చూసుకుంటుంది!
X

విక్ష‌ణ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తొలిసారి డైరెక్ట‌ర్‌గా మారి ఆమె చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ `స‌ర‌స్వ‌తి`. ప్రియ‌మ‌ణి, ప్ర‌కాష్ రాజ్‌, కిషోర్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్, స‌ప్త‌గిరి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌చార చిత్రంతో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీకి సాయి మాధ‌వ్ బుర్రా స్టోరీ అందించారు. సినిమా విశ్ర‌మ ఫ‌లితాన్నిచ్చింది. ఈ నేఫ‌థ్యంలోనే రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

నా క‌థ‌ని మాన‌భంగం చేశార‌ని, నేను అందించిన క‌థ‌తో సినిమా ప్రారంభించి త‌రువాత క‌థ మార్చేశార‌ని, క‌నీసం త‌న‌కు మార్పుల విష‌యం చెప్ప‌లేద‌ని ఆరోపించారు. అయితే ఆయ‌న ఆరోప‌ణ‌ల‌పై వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ తాజాగా స్పందించారు. సాయి గారు ఒక్క సిట్టింగ్‌కు కూడా రాలేద‌న్నారు. ఆయ‌న బిజీగా ఉన్నారు. పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఒక సెన్సిటీవ్ ఇష్యూపైన `రేప్` అనే వ‌ర్డ్ మీ లాంటి వాళ్ల నోటి నుంచి రావ‌డం బాగాలేదు. మ‌నం వాడే ప‌దాలు జాగ్ర‌త్త‌గా కొచెం చూసుకుని మాట్లాడాలి` అన్నారు.

మీరు క‌థ మార్చిన‌ప్పుడు సాయి గారికి చెప్పే ప్ర‌య‌త్నం చేశారా? అని మీడియా ప‌ర్స‌న్ ప్ర‌శ్నిస్తే..నేను మొద‌టి నుంచి చెప్తూనే ఉన్నాను క్లైమాక్స్ మార్చాలి అని. మీ అంద‌రికీ న‌చ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ నాది. అది మార్చింది నేనే. ఆ ట్విస్ట్ కి థియేట‌ర్ల‌లో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు` అని చెప్పుకొచ్చింది. అయితే మీరు క‌థ విన్న‌ప్పుడు `మ‌హారాజా` కానీ, `క్ష‌ణం` లాంటి సినిమాల ఫ్లేవ‌ర్‌లో ఉంద‌ని అనిపించ‌లేదా? అని అడిగిన ప్ర‌శ్న‌కు షాకింగ్ రిప్లై ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. `నేను ఈ క‌థ విన్న‌ప్పుడు `మ‌హారాజా` సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ క‌థ‌ని నేను `క్రాక్‌` సినిమా టైమ్‌లో విన్నాను.

నేను క‌ర్మ‌ని న‌మ్ముతాను. చెడు చేసేవాళ్లకి క‌ర్మ చూసుకుంటుంది. నా చుట్టూ ఉంటూ నాతో ఇన్ని సంవ‌త్స‌రాలు ఉండి నాకే ద్రోహం చేశారు. ప‌ర‌వాలేదు. ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి క‌ర్మ చూసుకుంటుంది` అంటూ ఫైర్ అయింది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో వ‌ర‌ల‌క్ష్మీ వెర్ష‌న్ చూస్తుంటే సాయి మాధ‌వ్ బుర్ర త‌ప్పు చేశార‌నే భావ‌న క‌లుగులోంది. కార‌ణం ఆయ‌న ఫుల్ బైండ్ స్క్రిప్ట్ ఇవ్వ‌లేద‌ని, కేవ‌లం వాయిస్ నోట్ మాత్ర‌మే పంపించార‌ని, నేను దానిలోని కాన్సెప్ట్‌ను మాత్ర‌మే తీసుకుని క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నాన‌ని వ‌రు చెబుతోంది.

అదే నిజ‌మైతే త‌ప్పు ఎరిది అన్న‌ది అంద‌రిలో క్లారిటీ వ‌చ్చేస్తుంది. మరి తాజాగా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ వివ‌ర‌ణ‌పై బుర్రా సాయిమాధ‌వ్ స్పందిస్తారా?.. నా వెన‌కే ఉండి నాకే ద్రోహం త‌ల‌పెట్టిన వాళ్ల‌ని క‌ర్మ వ‌దిలి పెట్ట‌దు అన్న వ‌ర‌ల‌క్ష్మి కామెంట్‌ల‌ని లైట్ తీసుకుంటారా? అన్నది సాయి మాధ‌వ్ బుర్రా స్పందించేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.