Begin typing your search above and press return to search.

సారంగపాణి జాతకం న్యూ డేట్ ఫిక్స్.. థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే..

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’కు కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది.

By:  Tupaki Desk   |   12 April 2025 10:54 AM IST
Sarangapani Jathakam to impress youth
X

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’కు కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను సరిపోయేలా రూపొందిన ఈ చిత్రం, ఏప్రిల్ 25న థియేటర్స్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా ప్రత్యేకతలను వివరించారు.

"ఈ వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిపోయే ఎంటర్‌టైనర్ గా ‘సారంగపాణి జాతకం’ నిలవబోతుంది. ఇది క్రిటికల్ అప్రిషియేషన్‌తో పాటు బాక్సాఫీస్‌ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది," అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. "అసలు ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే డిస్ట్రిబ్యూటర్స్ సూచన మేరకు మరింత మరింత భారీగా విడుదల కోసం ఏప్రిల్ 25కు వాయిదా వేయడం జరిగింది," అని అన్నారు.

ప్రియదర్శి, ‘బాలగం’, ‘35: చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి సినిమాల ద్వారా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు, ఈ సినిమాలో మళ్లీ ఆకట్టుకునే క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటారని, ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ తర్వాత శ్రీదేవి మూవీస్ బేనర్ పై వచ్చిన విజయం కొనసాగుతుందని నిర్మాత విశ్వాసం వ్యక్తం చేశారు.

రూ‌పా కొడువయూర్ ఈ సినిమాలో కథానాయికగా నటించగా,లు వెన్నెల కిషోర్, వీకే నరేష్, వైవా హర్ష లాంటి టాలెంటెడ్ కమెడియన్స్ ఎంటర్టైన్మెంట్ మరింత రెట్టింపు చేయనున్నారు. అంతేకాక తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని వివేక్ సాగర్ అందించగా, ఆయన కంపోజ్ చేసిన నాలుగు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాటోగ్రఫీ బాధ్యతలను పీజీ విందా నిర్వర్తించగా, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్‌మెంట్‌ను హ్యాండిల్ చేశారు. మొత్తానికి, ఈ వేసవిలో కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లే వారందరికి ‘సారంగపాణి జాతకం’ ఓ ఉత్తమ వినోదాన్ని అందించబోతుంది. ఏప్రిల్ 25న థియేటర్లలో సినిమా విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.