Begin typing your search above and press return to search.

శుభ్‌మాన్ గిల్ ప్రేమ‌లో సారా.. ఇదేనా ప్రూఫ్‌?

శుభ్‌మాన్ ఆట‌తీరును అమితంగా ఇష్ట‌ప‌డే సారా అత‌డితో నిండా మునిగిపోయిందంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో జోరుగా వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 7:00 AM GMT
శుభ్‌మాన్ గిల్ ప్రేమ‌లో సారా.. ఇదేనా ప్రూఫ్‌?
X

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ .. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మ‌న్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమ‌లో ఉందంటూ చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. శుభ్‌మాన్ ఆట‌తీరును అమితంగా ఇష్ట‌ప‌డే సారా అత‌డితో నిండా మునిగిపోయిందంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో జోరుగా వ్యాఖ్యానిస్తున్నారు. శుభ్ మాన్ తో సారా టెండూల్క‌ర్ క‌లిసి ఉన్న ఫోటోలు ఇటీవ‌ల నెటిజ‌నుల్లో వైర‌ల్ అవుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.


ప్ర‌స్తుతం శుభ్ మాన్ గిల్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో త‌న‌దైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడు. అత‌డు మైదానంలో బౌండ‌రీలు త‌రలిస్తుంటే ఆడిటోరియం నుంచి సారా టెండూల్క‌ర్ ఎగ్జ‌యిట్ అవుతున్న వీడియోల్ని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సోష‌ల్ మీడియా ఖాతాలో శుభ్ మాన్ ఫోజ్ ఒక‌టి షేర్ చేసిన సారా టెండూల్క‌ర్ ఆ ఫోటోకి ల‌వ్, కిస్ ఈమోజీల‌ను జోడించ‌డంతో అది సెన్సేష‌న్ గా మారింది. ఇదిగో సారా టెండూల్క‌ర్ ల‌వ్ కి ప్రూఫ్.. గిల్ ని ప్రేమిస్తోంది! అంటూ ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. అగ్నికి ఆజ్యం అన్న తీరుగా..సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, ప్ర‌ముఖ క‌థానాయిక‌ సారా అలీ ఖాన్ ఇటీవల అనన్య పాండేతో కలిసి కాఫీ విత్ కరణ్ 8 సోఫాలో కనిపించనుంది. హోస్ట్ కరణ్ జోహార్ ఇటీవలి ఎపిసోడ్‌లో సారా డేటింగ్ గురించి ప్ర‌స్థావిస్తూ.. క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ తో లింక‌ప్ వార్త‌ల‌పై ప్ర‌శ్నించాడు. అయితే ఆ సారా వేరు. అత‌డు వేరే సారా వెంట ప‌డుతున్నాడు! అంటూ సారా టెండూల్కర్ పేరును ప‌రోక్షంగా సారా అలీఖాన్ ప్ర‌స్థావించ‌డంతో అది కాస్తా సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇప్పుడు సారా టెండూల్క‌ర్ ఎక్స్ లో షేర్ చేసిన ఫోటో నిజ‌మైన‌దేన‌ని, ల‌వ్, కిస్ ఈమోజీల‌ను సారా షేర్ చేసింద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. అయితే ఇది సారా టెండూల్క‌ర్ అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతా నుంచి షేర్ అయిన‌దేనా? అన్న‌ది ఆరా తీస్తే అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింది.

నిజానికి సారా టెండూల్క‌ర్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలకు దూరంగా ఉంటున్నారు. త‌న పేరిట ఎలాంటి అధికారిక‌ ఖాతాలు తెర‌వ‌లేదు. కానీ ఫేక్ ఐడీలు ఇప్ప‌టికే బోలెడంత హంగామా సృష్టిస్తున్నాయి. వీటిలో సారా - గిల్ జంట‌గా ఉన్న ఫోటోలు కూడా వైర‌ల్ అయిపోతుండ‌డంతో అది ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. ఇవ‌న్నీ ఫేక్ అని కూడా తెలుస్తోంది.

ఇటీవ‌ల నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న డీప్ ఫేక్ ఫోటో అంత‌ర్జాలంలో పెను సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఇప్పుడు సారా టెండూల్క‌ర్ డీప్ ఫేక్ ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. సారా టెండూల్క‌ర్ తో పాటు ప‌లువురు బాలీవుడ్ క‌థానాయిక‌ల డీప్ ఫేక్ ఫోటోల‌పైనా చ‌ర్చ సాగుతోంది. ఇవ‌న్నీ మార్ఫింగ్ ఫోటోల మాయాజాలం అంటూ నిజ‌నిర్ధార‌ణ జ‌రిగింది.

సారా టెండూల్క‌ర్‌పైనే ఫోక‌స్:

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో సారా టెండూల్క‌ర్ పెద్ద ఎత్తున టార్గెట్ గా మారుతోంది. స్వ‌త‌హాగా అంద‌గ‌త్తె అయిన‌ సారా ఇప్పుడు డీప్‌ఫేక్ బాధితురాలు. ఈ బ్యూటీ శుభ్‌మాన్ గిల్‌ను కౌగిలించుకున్న ఫోటో ఒక‌టి లేటెస్టుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండేవారిని విప‌రీతంగా ఆకర్షించింది. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల‌లో వైరల్‌గా మారింది. అసలు ఫోటో విషయానికి వస్తే, సారా గత నెలలో తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌కు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట్ చేసిన ఫోటోల నుంచి ఎంపిక చేసుకున్న ఒక ఫోటోని మార్ఫ్ చేసి ఆ ప్లేస్ లో శుభ్ మాన్ ఫోటోని ఉంచారు. ప్రేమాయ‌ణం నిజ‌మేనంటూ డీప్‌ఫేక్ సృష్టించి ప్ర‌చారం చేసారు.

ఆన్‌లైన్‌లో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫ్ చేసిన వీడియో బ‌య‌ట‌ప‌డిన తర్వాత డీప్‌ఫేక్‌ల సమస్య మ‌రింత పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. ర‌ష్మిక ఇలాంటి దుశ్చ‌ర్య‌కు వ్యతిరేకంగా తన స్టాండ్‌ను స్పష్టంగా నొక్కిచెప్పింది. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం గురించి ప్రస్తావించింది. అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి ఇతర ప్రముఖుల నుండి కూడా ర‌ష్మిక‌కు గొప్ప‌ మద్దతు లభించింది. వారంతా ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను ఖండించారు. చట్టపరమైన చర్య తీసుకోవాలనే ర‌ష్మిక‌ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు.

సారా టెండూల్కర్ గురించి చెప్పాలంటే.. సారా ప్రస్తుతం ప్రయాణాలపై తన ప్రేమను కొనసాగిస్తోంది. ఐదు మిలియన్లకు పైగా అనుచరులతో సోషల్ మీడియాల్లో అత్యంత‌ ప్రభావశీలిగా గుర్తింపు తెచ్చుకుంది. సారా ఇటీవ‌ల మోడలింగ్ లో రాణిస్తోంది. త్వ‌ర‌లోనే వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ దీనిని సారా టెండూల్క‌ర్ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.