Begin typing your search above and press return to search.

హాట్ సెల్పీలో బికినీ బ్యూటీ? ఎవ‌ర‌బ్బా?

'పంజా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఓమ‌న్ బ్యూటీ సారాజేన్ డ‌యాస్ సుప‌రిచిత‌మే

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:22 AM GMT
హాట్ సెల్పీలో బికినీ బ్యూటీ? ఎవ‌ర‌బ్బా?
X

'పంజా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఓమ‌న్ బ్యూటీ సారాజేన్ డ‌యాస్ సుప‌రిచిత‌మే. తెలుగులో అమ్మ‌డికి అదే తొలి సినిమా అదే చివ‌రి సినిమా. ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇండస్ట్రీలో క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందే కోలీవుడ్..బాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చి మూడ‌వ ప్ర‌య‌త్నంగా తెలుగులో న‌టించింది. కానీ అమ్మ‌డు మూడు చోట్లా రాణించ‌లేక‌పోయింది.

అటుపై హిందీలో కొన్ని సినిమాలు చేసి వెండి తెర‌కు దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో సారా వెబ్ సిరీస్ ల‌పై దృష్టి పెట్టింది. అక్క‌డా మాత్రం అమ్మ‌డు ఇంకా యాక్టివ్ గానే ఉంది. మూడేళ్ల నుంచి సారా వెబ్ సిరీస్ ల‌తోనే స‌రిపెట్టుకుంది. గ‌తేడాది 'మేడ్ ఇన్ హెవెన్'.. 'ది ప్రీ లాన్స‌ర్' లాంటి వెబ్ సిరీస్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వీటితోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాది లో మ‌ళ్లీ సినిమా క‌బురు ఏదైనా చెబుతుందా? అని ఎదురు చూసినా ఇంకా ఆస‌మ‌యం రాన‌ట్లే క‌నిపిస్తుంది. అయితే ఇన్ స్టాలో మాత్రం అమ్మ‌డప్పుడు హాట్ ఫోటోలో యువ‌త‌ని చిల్ చేస్తుంది. రేర్ గా వ‌చ్చినా ర‌ప్పాండిచే ఫోటోల‌తో హాట్ టాపిక్ అవుతుంది. మోడ్ర‌న్ బ్యూటీ వీలైనంత వ‌ర‌కూ త‌న‌లో మోడ్ర‌న్ యాంగిల్ నే ఎక్కువ‌గా హైలైట్ చేస్తుంది.

తాజాగా సారా టూ పీస్ బికినీలో స్మార్ట్ ఫోన్ లో హాట్ సెల్పీ దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా ముఖానికి ఎదురుగా కెమెరా ఆన్ చేసి ఫేస్ ని హైడ్ చేస్తూ.. బికినీలో బ్యూటీని హైలైట్ చేస్తూ క్లిక్ మ‌ని పిం చింది. వైట్ పీస్ లో అమ్మ‌డి అందాలు అంతే మ‌త్తెక్కిస్తున్నాయి. సారా బ్యూటీలో అప్ప‌టి కీ..ఇప్ప‌టికీ ఎలాంటి మార్పు లేదు. ఇప్ప‌టికీ అదే లుక్ ని మెయింటెన్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గున‌పాలు దించే స్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానుల కామెంట్ల‌కు కొద‌వ‌లేదు.