Begin typing your search above and press return to search.

మంచు కొండ‌ల్లో వండుకు తింటున్న స్టార్ డాట‌ర్

ఒక వీడియోలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. తాను లాహోల్- స్పిటీ వ్యాలీలో ఉన్నాన‌ని వెల్ల‌డించింది

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:49 AM GMT
మంచు కొండ‌ల్లో వండుకు తింటున్న స్టార్ డాట‌ర్
X

న‌ట‌వార‌సురాలు సారా అలీ ఖాన్ వ‌రుస‌ ప్రాజెక్ట్‌ల కోసం సన్నద్ధం కావడానికి ముందు సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇటీవ‌లే ఫ్యాష‌న్ పుట్టిల్లు పారిస్‌ని రిలాక్స్ డ్‌గా అన్వేషించడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో సారా తన ప్యారిస్ ట్రిప్ నుండి చాలా ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. సారా ఊబ‌ర్-కూల్ దుస్తులలో అందంగా క‌నిపించింది.

తాజాగా సారా అలీఖాన్ త‌న లాహోల్ (హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్) ట్రిప్ నుంచి అద్భుత‌మైన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఒక వీడియోలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. తాను లాహోల్- స్పిటీ వ్యాలీలో ఉన్నాన‌ని వెల్ల‌డించింది. స్పిటీ వ్యాలీ అంద‌మైన ప్ర‌కృతితో స్వ‌ర్గ‌ ధామం. అక్క‌డ ఎత్త‌యిన ప‌ర్వ‌తాలు, ఘాట్ రోడ్ లు ప్ర‌కృతి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇది టూరిస్ట్ స్పాట్ ల‌కు ప్ర‌సిద్ధి. హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లోని మ‌నాలి మీదుగా ఈ మార్గం ఎంతో ఎత్తున ఉంటుంది. వేల మీట‌ర్ల ఎత్తున ఆక్సిజ‌న్ అంద‌ని చోటికి ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

ఆస‌క్తిక‌రంగా సారా అలీఖాన్ ఈ ప్ర‌యాణంలో త‌న ఆహారాన్ని తానే వండుకుని తిన‌డం ఆస‌క్తిని క‌లిగించింది. మ‌సాలా మ్యాగీ నూడిల్స్ ని ఓచోట గ్రామంలోనే వండుకుని తిన్న సారా ..మ‌రోచోట వేడి వేడిగా బొగ్గుల‌పై రోటీలు మ‌సాలా కూర‌లు వండుకుని మ‌రీ తింటోంది. చివ‌రిగా విలేజ్ ఆఫ్ శిషు... నుంచి భాయ్ భాయ్ చెబుతూ వెళ్లిపోయింది. త‌న‌తో పాటే త‌న స్నేహితులు కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఎగ్జ‌యిటింగ్ వీడియో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవల 'జారా హ‌ట్కే జ‌ర బ‌చ్కే'లో విక్కీ కౌశల్‌తో కలిసి కనిపించింది. జ‌ర‌ హాట్కే జరా బచ్కే బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టింది. త‌దుప‌రి అనురాగ్ బసు 'మెట్రో...ఇన్ డినో'లో కనిపించనుంది. ఆంథాలజీ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, కొంకణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, అలీ ఫజల్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. 'ఏ వతన్ మేరే వతన్' అనే చిత్రంలోను సారా న‌టించ‌నుంది.