Begin typing your search above and press return to search.

గిల్ బాదుడుకి..సారా గుండె జిల్!

సారా ఉత్సాహానికి నెటి జ‌నులు ఫిదా అవుతున్నారు. గిల్ ని ఎంత చ‌క్క‌గా ఎంక‌రేజ్ చేస్తుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ఈరోజు గిల్ సెంచ‌రీ చేయ‌డం ఖాయ‌మ‌నుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:08 PM GMT
గిల్ బాదుడుకి..సారా గుండె జిల్!
X

క్రికెట‌ర్లు..సెల‌బ్రిటీల మ‌ధ్య అవినాభావ‌ సంబంధం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. క్రీజులో ప్లేయ‌ర్ బౌండ‌రీలు..సిక్స‌ర్లు కొడుతుంటే! అభిమానించే హీరోయిన్లు పుల్ల‌కించిపు తుంటారు. ప్లైయింగ్ కిస్సులు తో వాళ్ల‌లో మ‌రింత ఉత్సాహం నింపుతుంటారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్ లో దాదాపు అలాంటి స‌న్నివేశమే క‌నిపిస్తుంది. అయితే ఆవిడ హీరోయిన్ కాదు గానీ...అంత‌కు మించి పాపుల‌ర్ అయిన బ్యూటీ.

ఆమె సారా టెండూల్క‌ర్. మ్యాచ్ లో శుభ‌మ‌న్ గిల్ బౌండ‌రీలు..సిక్స‌ర్లు బాదుంతుంటే సారా కేరింత‌లు కొట్టింది. గ్యాల‌రీ లో కూర్చుని గిల్ తెగ ఎంక‌రేజ్ చేసింది. అది చూసి గిల్ మ‌రింత చెల‌రేగాడు. తొలుత గిల్ ఫోర్ కొట్టాడు..ఆ వెంట‌నే రెండు భారీ సిక్సులు బాదాడు. దీంతో సారా త‌న్మ‌యానికి గురైంది. ముఖమంతా న‌వ్వుతో నింపోయింది. రెండు చేతులు జోడించి బిగ్గ‌ర‌గా చ‌ప్ప‌ట్లు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

సారా ఉత్సాహానికి నెటి జ‌నులు ఫిదా అవుతున్నారు. గిల్ ని ఎంత చ‌క్క‌గా ఎంక‌రేజ్ చేస్తుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ఈరోజు గిల్ సెంచ‌రీ చేయ‌డం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ అర్ద‌సెంచ‌రీ సాధించిన త‌ర్వాత ఔట్ అవ్వ‌డంతో సారా కూడా నిరుత్సాహ‌ప‌డింది. అయ్యో అవుటైపో యాడే? సెంచ‌రీ కొడితే బాగుండేద‌ని ఫీలైంది. ఈ మ్యాచ్ తో అయిపోలేదుగా.

ఇంకా చాలా మ్యాచ్ లున్నాయి. వాటిలో గిల్ ఆడుతాడు. సారా గ్యాల‌రీలో కూర్చుని ఎంక‌రేజ్ చేస్తుంది. తాను అనుకున్న‌ట్లు సెంచ‌రీ కొట్టి బ్యాట్ ఎత్తి ఓ ప్లైయింగ్ కిస్సు ఇస్తాడు. వెయిట్ అండ్ వాచ్. ప్ర‌స్తుతం ఇండియా ఫుల్ ఫామ్ లో ఉంది. ఆడిన మ్యాచ్ ల‌న్నీ గెలిచి పాయింట్ల పట్టిక‌లో నెవంబ‌ర్ స్థానంలో ఉంది.