Begin typing your search above and press return to search.

సైంధవ్.. బాక్సాఫీస్ బలం కోసం ఇలా!

ఇక ఇప్పుడు 'సరదా సరదాగా..' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ ఇది మనోహరమైన పాటలో వెంకటేష్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సాగే సంభాషణతో కూడా హైలెట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:17 PM GMT
సైంధవ్.. బాక్సాఫీస్ బలం కోసం ఇలా!
X

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ సైంధవ్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి అప్‌డేట్ కోసం బృందం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇప్ప‌టికే టీజ‌ర్, సాంగ్ విడుద‌ల చేశారు. ఈరోజు వీవీఐటీ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సినిమా రెండో సింగిల్‌ని ఆవిష్కరించారు. వెంకటేష్ గతంలో ఎప్పుడు లేనంత హైప్ తో సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న వెంకీ సాధారణ జనాల్లోకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు 'సరదా సరదాగా..' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ ఇది మనోహరమైన పాటలో వెంకటేష్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సాగే సంభాషణతో కూడా హైలెట్ గా నిలిచింది.

వెంకీ కూతురుగా సారా మంచి ఫ్యామిలీ సాంగ్ తో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాట ముగ్గురి మధ్య కొన్ని హృదయాలను కరిగించే క్షణాలను చూపిస్తుంది. ఇక వారి ఫ్యామిలీ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వారి మధ్య బంధాన్ని వివరిస్తుండగా, అనురాగ్ కులకర్ణి గాత్రం ఆ పాటకు ప్రత్యేక ఆకర్షణను తెస్తుంది.

మొదటి పాట మాస్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అయితే, ఇది ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతుంది అనిపిస్తోంది. వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. ఇటీవల హాయ్ నాన్న సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ వల్లనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ పెరిగాయి. చూస్తుంటే సైంధవ్ సినిమా యూనిట్ కూడా అదే తరహాలో ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరి వారి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జయప్రకాష్‌లు సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా ఉన్న సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు మరియు హిందీలో విడుదల కానుంది.