Begin typing your search above and press return to search.

గుండెల్లో క‌త్తి దించ‌క‌లా ఓ అంద‌మైన పిల్లా!

ఏదైతేనేం.. ఇక్క‌డ ఇంచుమించు అలాంటి స‌న్నివేశంలోనే క‌నిపిస్తోంది స్టార్ డాట‌ర్ సారా అలీఖాన్.

By:  Tupaki Desk   |   16 March 2024 7:02 AM GMT
గుండెల్లో క‌త్తి దించ‌క‌లా ఓ అంద‌మైన పిల్లా!
X

చేప పిల్ల నీళ్ల‌లోంచి ఆత్రంగా ఎగురుతూ గ‌ట్టున ప‌డింది. ఆపై తిరిగి నీళ్ల‌లోకి గెంతేందుకు చాలా ప్ర‌యాస‌లు ప‌డింది. వ‌య‌సొచ్చిన అమ్మాయి.. గ‌ట్టున ప‌డిన చేప పిల్ల ఒక‌టేన‌ని అంటాడు ఓ ప్ర‌ముఖ క‌వి. ఏదైతేనేం.. ఇక్క‌డ ఇంచుమించు అలాంటి స‌న్నివేశంలోనే క‌నిపిస్తోంది స్టార్ డాట‌ర్ సారా అలీఖాన్.


త‌న‌దైన అందం య‌వ్వ‌నంతో క‌ట్టి ప‌డేస్తున్న సారా అలీఖాన్ కి దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ బ్యూటీ తాను న‌టించిన ప్ర‌తి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం కోసం పాకులాడుతోంది. త‌న‌లోని ప‌రిణ‌తిన బ‌య‌ట‌పెడుతోంది. ఇప్పుడు మ‌ర్డ‌ర్ ముబార‌క్ ప్ర‌మోష‌న్స్ కోసం చాలా క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తోంది. సాంప్రదాయ రెడ్ కార్పెట్‌లు ఇంటర్వ్యూలను పక్కనపెట్టి సారా స్ట‌న్నింగ్ ఫోటోషూట్ల‌తో సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తోంది.


తాజాగా బ్లాక్ ఫ్లోరల్ గౌను ధరించి స్ట‌న్నింగ్ ఫోజ్ ల‌తో క‌ట్టి ప‌డేసింది. ఖరీదైన సోఫాలో త‌న‌ను చూడ‌గానే ఆక్వేరియంలో ఈదుతున్న‌ అంద‌మైన చేప‌పిల్ల‌లా క‌నిపించింది. సారా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. `క్లబ్ యు టు డెత్` అనే పుస్తకాన్ని చదువుతూ క‌నిపించింది. ఇది సినిమా డార్క్ థీమ్‌ను ఫ‌న్ వేలో సూచిస్తుంది. మరొక ఫోటోలో తన శరీరానికి కత్తిని గుండెల‌పైకి ఆన్చి క‌నిపించింది. సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే మ‌ర్డ‌ర్ అయిపోతావ్! అన్న‌ట్టుగా ఉంది ఈ ఫోజ్. గుండెల్లో క‌త్తి దించ‌క‌లా ఓ అంద‌మైన పిల్లా! అంటూ ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ కి నెటిజ‌నులు కామెంట్లు రువ్వుతున్నారు.


మ‌ర్డ‌ర్ ముబార‌క్.. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఉత్కంఠభరితమైన హత్యల వెన‌క‌ మిస్టరీ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. హోమీ అద‌జానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సారా పాత్ర ఇందులో హంతకురాలా కాదా? అన్న‌ది చూడాలి. నేడు విడుద‌లైన ఈ చిత్రంపై మిశ్ర‌మ స‌మీక్ష‌లు వ‌చ్చాయి.