Begin typing your search above and press return to search.

పొట్ట చుట్టూ కొవ్వుతో స్టార్ హీరోయిన్ అసౌక‌ర్యం!

ఇప్పుడు ఆమె రెండు వారాల వ్యవధిలో తన పొట్ట కొవ్వును తొలగించడానికి ముందు తీసిన ఒక‌ ఫోటోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 9:52 AM GMT
పొట్ట చుట్టూ కొవ్వుతో స్టార్ హీరోయిన్ అసౌక‌ర్యం!
X

బాలీవుడ్ లో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగేసిన న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్. త‌న‌దైన అందం, న‌వ్వు, డౌన్ టు ఎర్త్ స్వ‌భావం, న‌ట ప్ర‌తిభ‌తో ఇప్ప‌టికే ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీలో పాగా వేసింది. సారా హిందీ చిత్ర‌సీమ‌లోని బిజీ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. అయితే సారా అలీఖాన్ ని ఇటీవ‌ల కొన్ని స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. అందులో అధిక బ‌రువు, ఫ్యాట్ స‌మ‌స్య ఒక‌టి.

నిజానికి కెరీర్ ప్రారంభానికి ముందు సారా అలీఖాన్ 100కేజీలు పైగా బ‌రువు ఉండేది. కానీ క‌థానాయిక అయ్యేందుకు ఫిట్నెస్ ఫ్రీక్ గా మారింది. అదే క్ర‌మంలో త‌న బ‌రువును 70కేజీల కంటే త‌క్కువ‌కు వ‌చ్చేలా శ్ర‌మించింది. మారిన ఫిట్ లుక్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఇప్ప‌టికీ త‌న‌కు బ‌రువు స‌మ‌స్య‌లున్నాయి. ఓవైపు బికినీలు, స్విమ్ సూట్ల‌లో వేడి పెంచేస్తున్నా కానీ ఇప్ప‌టికీ బెల్లీ ఫ్యాట్ (పొట్ట చుట్టూ కొవ్వు)ను త‌గ్గించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాన‌ని తెలిపింది. అంతేకాదు.. పొట్ట చుట్టూ కొవ్వు బ‌య‌టికి క‌నిపించే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో అప్ లోడ్ చేయ‌డానికి చాలా ఇబ్బందిప‌డుతున్నాన‌ని కూడా సారా నిజాయితీగా అంగీక‌రించింది.

నిజానికి సారా అలీ ఖాన్ అధిక‌ బరువు తగ్గడం తన అభిమానులలో చాలా మందికి ప్రేరణ. ఇప్పుడు ఆమె రెండు వారాల వ్యవధిలో తన పొట్ట కొవ్వును తొలగించడానికి ముందు తీసిన ఒక‌ ఫోటోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. సారా ఇటీవలి ఈవెంట్‌ల నుండి తన ఫోటోల కోల్లెజ్‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా.. అందులోని ఒక ఫోటో తన లావు బొడ్డును బ‌హిర్గ‌తం చేసింది. దీనికి సారా ఆస‌క్తిక‌ర వివ‌ర‌ణ ఇచ్చుకుంది. "నిజాయితీగా ఈ టాప్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది - కానీ నేను 2 వారాల్లో ఇది సాధించినందుకు నిజంగా గర్వపడుతున్నాను. బరువు సమస్యలు నాకు ఎప్పుడూ ఇబ్బందిక‌ర‌మే. సెలవు కాలానికి బై-బై.. అప‌రాధం నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే, క్యాలరీలు త‌గ్గించి శాంత‌ప‌ర‌చాలి" అని వ్యాఖ్య‌ను జోడించింది. ఫిట్‌నెస్ అనేది ఒక ప్రయాణం కాబట్టి కొనసాగించండి అని కూడా వ్యాఖ్య‌ను జోడించారు.

సారా షేర్ చేసిన మొదటి ఫోటోలో తన బొడ్డును ఆవిష్క‌రిస్తోంది. ఇందులో యోగా చాపపై కూర్చుని ఉంది. కెమెరా వైపు ముఖాన్ని విచారంగా పెట్టింది. రెండవ ఫోటోలో మెరిసే గోల్డెన్ కో-ఆర్డ్‌లో సారా త‌న అంద‌మైన రూపాన్ని ప్రదర్శించింది. చివరి ఫోటో.. మనీష్ మల్హోత్రా దీపావళి ఈవెంట్ నుండి బ‌య‌టికి వ‌చ్చింది. ఈవెంట్ కోసం సారా పింక్ -సిల్వర్ లెహెంగాతో పాటు నెక్‌లైన్ షర్ట్ ధరించింది. ఆమె అధిక బ‌రువు ఉన్న‌ ఆభరణాలను ధరించడం మానేసింది. ఇటీవ‌ల‌ అనన్య పాండేతో కలిసి 'కాఫీ విత్ కరణ్' సీజన్ 8 ఎపిసోడ్‌లో కనిపించనుంది. సారా ఇటీవల విక్కీ కౌశల్‌తో కలిసి 'జరా హాట్కే జరా బచ్కే'లో కనిపించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

అనురాగ్ బసు 'మెట్రో.. ఇన్ డినో'లో సారా కనిపించనుంది. ఆంథాలజీ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, కొంకణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, అలీ ఫజల్ మరియు నీనా గుప్తా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తదుప‌రి 'ఏ వతన్ మేరే వతన్' సెట్స్ పై ఉంది. నిజఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్-డ్రామా ఇది. బొంబాయిలోని ఒక కాలేజ్ అమ్మాయి స్వాతంత్య్ర‌ సమరయోధురాలిగా మారి పోరాడిన చ‌రిత్ర‌కు సంబంధించిన క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ కల్పిత కథ 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో రూపొందిన‌ది. ఇది దేశంలోని యువత ధైర్యం, దేశభక్తి, త్యాగం గురించిన కథ. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. దరాబ్ ఫరూకీ .. కన్నన్ అయ్యర్ సంయుక్తంగా రాసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.