Begin typing your search above and press return to search.

స‌చిన్ కూతురితో న‌టుడు డేటింగ్?

బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌కుండానే ఒక స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది సారా టెండూల్క‌ర్.

By:  Tupaki Desk   |   4 May 2025 11:00 PM IST
స‌చిన్ కూతురితో న‌టుడు డేటింగ్?
X

బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌కుండానే ఒక స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది సారా టెండూల్క‌ర్. త‌న అంద‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన న‌వ్వుతో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచేస్తోంది ఈ బ్యూటీ. సారా త‌న అంద‌చందాలు, ప్ర‌తిభ‌తో న‌టిగా స్థిర‌ప‌డుతుంద‌ని భావించినా.. త‌న త‌ల్లి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని వైద్య వృత్తిలో రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు మోడ‌లింగ్ రంగంలోను రాణిస్తోంది.

అయితే త‌న వృత్తి- ప్ర‌వృత్తిని మించి సారా టెండూల్క‌ర్ డేటింగ్ వ్య‌వ‌హారాలపై బోలెడంత ప్ర‌చారం సాగుతోంది. సారా ఇంత‌కుముందు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ శుభ్‌మాన్ గిల్ తో డేటింగ్ చేస్తోందంటూ గుసగుస‌లు వినిపించాయి. కానీ ఈ డేటింగ్ కి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. సారా కానీ, గిల్ కానీ దీనిని ధృవీక‌రించ‌లేదు.

ఇంత‌లోనే ఇప్పుడు సారా టెండూల్క‌ర్ బాలీవుడ్ యువ‌హీరో సిద్ధాంత్ చ‌తుర్వేదితో డేటింగ్ లో ఉంద‌న్న మ‌రో కొత్త పుకార్ అభిమానుల్లో వేడెక్కిస్తోంది. సారా- సిద్ధాంత్ ఒక‌రికొక‌రు స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఒక‌రి కంపెనీని మ‌రొక‌రు ఎంత‌గానో ఆస్వాధిస్తున్నారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఆ ఇద్ద‌రూ క‌లిసి బ‌హిరంగంగా క‌నిపించింది లేదు. త‌మ బంధం గురించి ఎక్క‌డా ఓపెన‌వ్వ‌లేదు. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో న‌డుస్తోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

గ‌ల్లీబోయ్ ఫేం సిద్ధాంత్ చ‌తుర్వేది హిందీ చిత్ర‌సీమ‌లోని అరుదైన ప్ర‌తిభావంతుడైన న‌టుడు. అత‌డి ఛ‌రిష్మాకు సారా ఆక‌ర్షితురాలై ఉంటుంద‌ని ఊహిస్తున్నారు. సిద్దాంత్ - సారా రహస్యంగా కలుస్తున్నారని, ఒకరితో ఒకరు సహవాసం ఆనందిస్తున్నార‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ జంట‌ స్నేహం ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉంది.. కానీ వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.. అని క‌థ‌నాలొస్తున్నాయి.

మ‌రోవైపు సారా టెండూల్క‌ర్ నుంచి కొంత‌కాలంగా దూరంగా ఉంటున్న శుభ్ మాన్ గిల్ న‌టి హిందీ న‌టి అవ‌నీత్ కౌర్ తో డేటింగ్ లో ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనికి కూడా ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. సారా - సిద్ధాంత్, గిల్ - అవ్ నీత్ కౌర్ జంట‌ల మ‌ధ్య ప్రేమాయ‌ణంపై వ‌స్తున్న వార్త‌లు ప్ర‌స్తుతానికి నిరాధార‌మైన‌వి. కానీ వారి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.