Begin typing your search above and press return to search.

సినీహీరోతో సారా టెండూల్క‌ర్ బ్రేక‌ప్?

సిద్ధాంత్- సారా టెండూల్క‌ర్ క‌లిసి ప‌లుమార్లు ప‌బ్లిగ్గా క‌నిపించారు. దీంతో పుకార్లు వేడెక్కించాయి.

By:  Tupaki Desk   |   21 May 2025 10:46 AM IST
సినీహీరోతో సారా టెండూల్క‌ర్ బ్రేక‌ప్?
X

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ చాలా కాలం క్రితం ట్యాలెంటెడ్ క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్ తో డేటింగ్ చేసింద‌ని, ఆ త‌ర్వాత అనుకోని కార‌ణాల‌తో ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయ్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ కొంత గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చ‌తుర్వేదితో సారా ప్రేమ‌లో మునిగింద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. దీనిని సారా కానీ, సిద్ధాంత్ కానీ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.

సిద్ధాంత్- సారా టెండూల్క‌ర్ క‌లిసి ప‌లుమార్లు ప‌బ్లిగ్గా క‌నిపించారు. దీంతో పుకార్లు వేడెక్కించాయి. సారా అత‌డి సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంద‌ని ప్ర‌చారం సాగింది. తాజా స‌మాచారం మేర‌కు...సారా టెండూల్కర్ ప్రేమాయణం గురించి ఆన్‌లైన్‌లో వార్తలు వచ్చిన కొన్ని వారాలకే తమ సంబంధాన్ని ముగించుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు.. దీంతో బాలీవుడ్ స‌హా క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు. ఆ వెంట‌నే డేటింగ్ పుకార్లు మొద‌ల‌య్యాయి. కానీ ఇప్పుడు ఈటైమ్స్ క‌థ‌నం ప్ర‌కారం.. సిద్ధాంత్ - సారా ఒకరినొకరు తమ కుటుంబాలకు పరిచయం చేసుకున్న వార్త‌లు త‌ర్వాత‌... వారి క‌థ అనూహ్య‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత చాలా కాలానికి బ్రేక‌ప్ క‌థ‌నాలొస్తున్నాయి. ఈ యువ‌జంట‌ ఇటీవలే విడిపోయారు. సిద్ధాంత్ ఈ సంబంధాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇరు కుటుంబాలు ఒక‌రితో ఒక‌రు కలిసిన తర్వాతే ఇది జరిగింది.. అని ఈటైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

అయితే ఈ హ‌ఠాత్ ప‌రిణామానికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బాగా ద‌గ్గ‌రైన జంట ఇంత‌లోనే విడిపోవ‌డ‌మేమిటీ? అంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సిద్ధాంత్ గ‌తంలో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో డేటింగ్ చేసాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఈ సంబంధం గత సంవత్సరం ముగిసినట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాతే సిద్ధాంత్ - సారా టెండూల్క‌ర్ డేటింగ్ వార్త‌లు వైరల్ అవ్వ‌డం మొద‌లైంది. తాను 20 ఏళ్ల వ‌య‌సులోనే ప్రేమ‌, కెరీర్ గురించి ఆలోచిస్తే కేవ‌లం కెరీర్ అనే ఆప్ష‌న్ ఎంచుకున్నాన‌ని సిద్ధాంత్ గ‌త ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ప్ర‌స్తుతం బ్రేక‌ప్ వార్త‌ల‌పై సారా కానీ, సిద్ధాంత్ కానీ స్పందించ‌లేదు.