పొట్టి దుస్తుల్లో జిల్లనిపించిన సారా టెండూల్కర్
అందుకే ఇప్పుడు ఇలా పొట్టి స్కర్టులో ప్రత్యక్షమైన సారాను చూడగానే, యూత్ లో కల్లోలం మొదలైంది. ప్రఖ్యాత లూయీస్ వీట్టన్ హ్యాండ్ బ్యాగులు, పర్సుల కోసం ప్రకటనలో నటించిన సారా టెండూల్కర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 9:16 AM ISTచిట్టి పొట్టి దుస్తుల్లో హృదయాలను గాయపరిచే విద్య కేవలం సినిమా హీరోయిన్లకే సాధ్యమని అనుకుంటే పొరపాటే. ఇదిగో ఇక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పొట్టి దుస్తుల్లో హొయలు పోతుంటే యూత్ మతి చెడుతోంది. కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తూ సారా మరోసారి మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది.
క్రికెట్ గాడ్ వారసురాలిగా సహజంగానే సారాపై అందరి దృష్టి ఉంటుంది. ఇటీవల కమర్షియల్ ప్రకటనల్లో నటిస్తూ మోడల్ గా రాణిస్తున్న సారా టెండూల్కర్ మోడలింగ్ లో తన ప్రతిభతో ఆకర్షిస్తోంది. ఇప్పుడు మరోసారి ఓ ప్రకటనలో నటించేందుకు గ్లామరస్ దుస్తుల్లో దర్శనమిచ్చింది. టీనేజీ నుంచి మెచ్యూర్డ్ ఏజ్ లోకి అడుగుపెడుతున్న సారా అందచందాలు, రూపలావణ్యానికి యూత్ ఫిదా అయిపోయింది.
సారా లాంటి అందగత్తె బాలీవుడ్ లో కథానాయికగా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ సారాకు ఉంది. సోషల్ మీడియాల్లోను అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సారా పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి సరైన సమయమిదేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే సారా మాత్రం కేవలం మోడలింగ్ వరకే పరిమితమైంది. నటన తనకు సూట్ కాదని, కెమెరా ముందు నిలబడటం తనకు చాలా కష్టమని చెప్పేసింది. కానీ సారాలో చురుకుదనం చూస్తుంటే, తన మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం.
అందుకే ఇప్పుడు ఇలా పొట్టి స్కర్టులో ప్రత్యక్షమైన సారాను చూడగానే, యూత్ లో కల్లోలం మొదలైంది. ప్రఖ్యాత లూయీస్ వీట్టన్ హ్యాండ్ బ్యాగులు, పర్సుల కోసం ప్రకటనలో నటించిన సారా టెండూల్కర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను రెగ్యులర్ గా తన ఖాతాలో వేసుకుంటూ సారా భారీగానే ఆర్జిస్తోంది.
