1400కోట్లకు వారసురాలు CA కొడుక్కి పడిపోయిందా?
గత కొంతకాలంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ యువనటుడు సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉందని ముంబై మీడియా కోడై కూస్తోంది.
By: Tupaki Desk | 7 May 2025 10:59 AM ISTగత కొంతకాలంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ యువనటుడు సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉందని ముంబై మీడియా కోడై కూస్తోంది. ఈ జంట కలిసి కనిపించడంతో ఈ గాసిప్పులు వేగంగా వైరల్ అయ్యాయి. అయితే టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో సారా ప్రేమలో ఉందన్న పుకార్ల నడుమ, ఇప్పుడు ఈ పుకార్లు నమ్మశక్యం కానివి. సారా- గిల్ విడిపోయిన తర్వాత ఇప్పుడు సారా నటుడితో ప్రేమలో పడిందని కూడా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి.
అయితే సిల్వర్ స్పూన్ కిడ్ కి గల్లీ బోయ్ కి లంకె ఎలా కుదిరింది? అన్నదే సస్పెన్స్ గా మారింది. ఆ ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ లకు ఔటింగులకు వెళ్లిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇంతవరకూ బయటకు రాలేదు. కనీసం ఏదైనా కమర్షియల్ ప్రకటనలో అయినా కలిసి కనిపించలేదు.
పైగా సిద్ధాంత్ చతుర్వేది బాలీవుడ్ లో ఇంకా ఎదుగుతున్న నటుడు. అతడు ముంబైలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) స్టడీస్ ని పూర్తి చేసి, నటనలోకి వచ్చాడు. అతడి తండ్రి కూడా సీఏ. అయితే ఒక సీఏ కొడుకును 1400 కోట్ల ఆస్తులున్న సచిన్ కుమార్తె ప్రేమిస్తుందా? అంటూ మరో సందేహం నెటిజనుల్లో వ్యక్తమవుతోంది. ప్రతిభావంతుడైన సిద్ధాంత్ ఇంతకుముందు జోయా అక్తర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ గల్లీబోయ్ లో నటించాడు. రణ్ వీర్ తో పోటీపడుతూ చక్కని నట ప్రదర్శనతో సిద్ధాంత్ ఆకట్టుకున్నాడు. గెహ్రయాన్ సహా పలు చిత్రాల్లో అతడి నటనకు పేరొచ్చింది.
ఎదుగుతున్న నటుడికి ఇలాంటి లింకప్ వార్తలు మేలు చేయవు సరికదా కెరీర్ ని పట్టి కిందికి గుంజేస్తాయి. అందువల్ల అతడు కెరీర్ పైనే దృష్టి సారిస్తే మంచిదని కూడా అభిమానులు సూచిస్తున్నారు. అలాగే ఎఫైర్ వార్తలు వస్తే, తన కెరీర్ కి అంత మంచిది కాదని గ్రహించిన శుభ్ మాన్ గిల్ కూడా చాలా తెలివిగా, క్రికెటర్లు ఎప్పుడూ కుటుంబానికి అందుబాటులో ఉండలేరని, పర్యటనలతోనే సరిపోతుందని చెప్పాడు. అలా సారా టెండూల్కర్ తో డేటింగ్ కి టైమ్ లేదని చెప్పకనే చెప్పేసాడు.
