Begin typing your search above and press return to search.

న‌ట‌నారంగేట్రంపై సారా టెండూల్క‌ర్ ట్విస్ట్

సారా తాజా ఇంట‌ర్వ్యూలో త‌న‌ను న‌టించాల్సిందిగా ఎవ‌రైనా కోరితే దానిని తిర‌స్క‌రిస్తున్నాన‌ని సారా టెండూల్క‌ర్ వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   11 May 2025 12:30 PM
న‌ట‌నారంగేట్రంపై సారా టెండూల్క‌ర్ ట్విస్ట్
X

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ ఆరంగేట్రం గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినీ సెల‌బ్రిటీల‌తో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించే సారా టెండూల్క‌ర్ క‌థానాయికగా ఆరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిపై స‌చిన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. తాజాగా వోగ్ ఇండియాతో ప్రత్యేక సంభాష‌ణ‌లో సారా టెండూల్క‌ర్ స్వ‌యంగా త‌న తెరంగేట్రం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

సారా తాజా ఇంట‌ర్వ్యూలో త‌న‌ను న‌టించాల్సిందిగా ఎవ‌రైనా కోరితే దానిని తిర‌స్క‌రిస్తున్నాన‌ని సారా టెండూల్క‌ర్ వెల్ల‌డించింది. ''నేను అంతర్ముఖురాలిని... కెమెరాలు నన్ను భయపెడుతున్నాయి'' అని సారా వెల్ల‌డించింది. ఆ వృత్తికి న్యాయం చేయ‌లేన‌ని భావిస్తున్నాను. నటన నాకు సంతృప్తి కంటే ఎక్కువ ఆందోళనను ఇస్తుంది. అందుకే అవ‌కాశాలు వ‌చ్చినా తిర‌స్క‌రిస్తున్నాను.. అని తెలిపింది. తాను న‌ట‌న‌లోకి రాలేన‌ని సారా అధికారికంగా వెల్ల‌డించింది.

ఫ్యాషన్ షూట్‌లు, బ్రాండ్స్ ప్ర‌చారాల‌లో దూకుడుగానే ఉన్న సారా న‌ట‌న‌ను కెరీర్ గా ఎంచుకునే ఆలోచ‌న‌తో లేద‌ని త‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు ప్ర‌జాద‌ర‌ణ‌, అసాధారణ‌మైన‌ బ్యాకింగ్ ఉన్న‌ప్ప‌టికీ తాను స్టార్‌డమ్‌ను ఆశించడం లేదని సారా స్పష్టంగా చెప్పింది. నేను ఫ్యాషన్, అందం, లైఫ్ స్టైల్ వంటి వృత్తుల‌లో కూడా పని చేస్తాను. నేను ప్రామాణికమైనది అనిపించేటిని మాత్రమే తీసుకుంటాను.. ప్రతిదానికీ అవునన‌లేను! అని సారా అంది.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలేజ్ లండన్ లో బయో మెడికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన సారా వైద్య‌వృత్తిలో కౌన్సిలింగ్ కెరీర్ పైనా దృష్టి సారించ‌నుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తూ ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాల‌పై త‌న‌వంతు సేవాకార్య‌క్ర‌మాల్లోను పాల్గొంటోంది.