కంగారూ దేశంలో క్రికెట్ గాడ్ కుమార్తె!
ప్రస్తుతం ఆస్ట్రేలియా విహార యాత్ర నుంచి వరుస ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 16 April 2025 11:58 PM ISTక్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న సారా బాలీవుడ్ లో అడుగుపెడుతుందని అంతా భావించారు. తనకు ఉన్న ఛరిష్మా, గ్లామర్ దృష్ట్యా నటిగా రాణిస్తుందని, బాలీవుడ్ యంగ్ గాళ్స్ కి గట్టి పోటీనిస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
కానీ సారా ఇంతవరకూ నటనలో ప్రవేశం గురించి చెప్పడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. అందానికి అందం, అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ ఉన్న సారా టెండూల్కర్ కేవలం కొన్ని వాణిజ్య ప్రకటనలకు మాత్రమే పరిమితమవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రెడిషన్ ని బ్రేక్ చేస్తూ సారా గ్లామర్ రంగంలో అడుగుపెడుతుందని కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.
సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా, సారా టెండూల్కర్ ఎందుకు అవకాశాన్ని ఉపయోగించుకోదు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సారా గ్లామర్ రంగంలో అడుగుపెట్టాలంటే తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని కూడా టెండూల్కర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే సినీరంగంలో ఉన్నా లేకపోయినా ఫ్యాషన్ ఇండస్ట్రీలో వైబ్స్ ని సృష్టిస్తూ నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంది సారా. తాజాగా సారా సమ్మర్ స్టైల్ దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా విహార యాత్ర నుంచి వరుస ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఆస్ట్రేలియా ట్రావెల్ డైరీస్ నుంచి సారా, తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను సారా షేర్ చేసింది.
అంతేకాదు ఇన్ స్టాలో ఆస్ట్రేలియా అందాలను ఏరియల్ వ్యూలో కవర్ చేసి వాటిని షేర్ చేస్తుంటే, ఇవన్నీ వండర్ ఫుల్ వ్యూతో ఆకర్షిస్తున్నాయి. అలాగే సారా చిక్ క్లాసిక్ లుక్ గురించి యూత్ ముచ్చటించుకుంటున్నారు. సమ్మర్ ని ద్వీప దేశంలో ఎంజాయ్ చేస్తూ ఈ సెలబ్రిటీ కిడ్ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా సారా తన స్నేహితులతో కలిసి చాపర్ లో ఆస్ట్రేలియా అందాలను ఆస్వాధించిందని కూడా అర్థమవుతోంది.
