Begin typing your search above and press return to search.

డేటింగులు ప‌రిణ‌తితో ఆలోచించేలా చేసాయి: సారా అలీఖాన్

అలాగే ప్రేమ భాష గురించి సారా ఆస‌క్తిక‌రంగా వివ‌రించింది. నిజానికి ప్రేయ‌సి- ప్రియుడు వారి భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచే విధానం వేరుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   5 July 2025 6:00 AM IST
డేటింగులు ప‌రిణ‌తితో ఆలోచించేలా చేసాయి: సారా అలీఖాన్
X

బోయ్ ఫ్రెండ్ ని ఎలా ఎంపిక చేసుకోవాలో నేటిత‌రం అమ్మాయిల‌కు తెలిసింది త‌క్కువే. అయితే అలాంటి వారికి సారా అలీఖాన్ ఇచ్చిన స‌ల‌హాలు చాలా ర‌కాలుగా స‌హ‌క‌రిస్తాయి. ఇంత‌కీ సారా ఏం చెప్పింది? అంటే.. త‌న గ‌తానుభ‌వాల నుంచి అస‌లు బోయ్ ఫ్రెండ్ ని అమ్మాయిలు ఎలా అర్థం చేసుకోవాలో చక్క‌గా చెప్పింది.

కొంత‌ విరామం తర్వాత అనురాగ్ బసు `మెట్రో ఇన్ డినో`తో సారా తిరిగి తెరపైకి వచ్చింది. ప్ర‌జాద‌ర‌ణ పొందిన `లైఫ్ ఇన్ ఎ మెట్రో`కు ఇది సీక్వెల్. ఈ సీక్వెల్ లో సారా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజా ఇంట‌ర్వ్యూలో తాను ప్ర‌స్తుతం ఒంట‌రిగా ఉన్నాన‌ని సారా చెప్పింది. మోడ్ర‌న్ ల‌వ్ అనేక స‌మ‌స్యల‌తో కూడ‌కున్న‌ద‌ని సారా చెప్పింది. నేడు ప్రేమ‌కు కొర‌త ఉంద‌ని కూడా అంది. తన గత సంబంధాలు త‌న‌ను ప‌రిణ‌తి ఉన్న అమ్మాయిగా తయారు చేసాయ‌ని చెప్పింది.

అలాగే ప్రేమ భాష గురించి సారా ఆస‌క్తిక‌రంగా వివ‌రించింది. నిజానికి ప్రేయ‌సి- ప్రియుడు వారి భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచే విధానం వేరుగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రికి వారి సొంత మార్గాలు ఉంటాయి. మీ ప్రేమ భాష మీ భాగస్వామి సరిపోలకపోవచ్చు. కానీ ఎవ‌రికి వారు తమకు తెలిసిన మార్గంలో తమ వంతు కృషి చేస్తున్నారని అర్థం చేసుకోవాలి అని సారా అన్నారు. అయితే త‌న పాత బోయ్ ఫ్రెండ్స్ ని పోలి ఉండ‌ని వ్య‌క్తి కోసం వెతుకుతాన‌ని సారా చెప్పింది.

భాగ‌స్వాములు ఆర్థికంగా ఖ‌ర్చు విష‌యంలో షేర్ చేసుకోవాల‌ని కూడా సారా తెలిపింది.

ఏదైనా డేటింగ్ యాప్‌లలో ఉన్నారా? అని ప్ర‌శ్నించ‌గా, తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని కొంద‌రు ఉప‌యోగించ‌డం బాగానే ఉన్నా కానీ ప్రతిదీ డిజిటల్‌గా మారిన ప్రపంచంలో, భాగస్వామిని కలవడం కూడా డిజిటల్‌గా మారితే అది నాకు సరదా ఇవ్వ‌దు! అని సారా చెప్పింది. సారా చెబుతున్న దానిని బ‌ట్టి త‌న‌తో డేటింగ్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కార్తీక్ ఆర్య‌న్ గురించి రాంగ్ సైడ్ చెబుతున్న‌ట్టే అనిపిస్తోంది.