Begin typing your search above and press return to search.

సప్త సాగరాలు నెలలోపే OTT రిలీజ్..!

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హేమంత్ ఎం రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా మొదటి పార్ట్ అదే సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేయగా రెండు వారాల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 10:15 AM GMT
సప్త సాగరాలు నెలలోపే OTT రిలీజ్..!
X

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హేమంత్ ఎం రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా మొదటి పార్ట్ అదే సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేయగా రెండు వారాల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో సైడ్ A కి రెస్పాన్స్ పర్వాలేదు అన్నట్టుగా రాగా సైడ్ Bని నవంబర్ 17న కన్నడ వెర్షన్ తో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సైడ్ A కన్నా సైడ్ B లో ఎక్కువ కథ ఉన్నా ఆడియన్స్ ఎందుకో సైడ్ Bని లైట్ తీసుకున్నారు. రక్షిత్ శెట్టి అండ్ టీం ఎంత ప్రమోట్ చేసినా సప్త సాగరాలు దాటి సైడ్ Bని ఆడియన్స్ పట్టించుకోలేదు.

థియేట్రికల్ రిలీజ్ ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఆ సినిమాను త్వరగానే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ భారీగా కొనేసిన ఓటీటీ సంస్థలు థియేట్రికల్ రన్ పూర్తి కాకముందే సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తాయి. ఇక వెండితెర మీద పెద్దగా ఆడని సినిమాలకు ఇంకాస్త ముందుగా ఓటీటీ రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమాను కూడా నెల లోపే ఓటీటీలోకి తెస్తున్నారు.

డిసెంబర్ 15న అమేజాన్ ప్రైమ్ వీడియోలో సప్త సాగరాలు దాటి సైడ్ B ఓటీటీ రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత్, చైత్ర ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా సైడ్ ఏ ఆకట్టుకున్న రేంజ్ లో సైడ్ B అలరించలేకపోయింది.

సప్త సాగరాలు దాటి సైడ్ A ప్రైమ్ వీడియోలో కూడా మంచి వ్యూయర్షిప్ సాధించింది. ఎలాగు ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అనుకుని సినిమాను థియేట్రికల్ వెర్షన్ స్కిప్ చేసిన వారు ఉండొచ్చు. మరి సైడ్ B ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఒక కమర్షియల్ సినిమాను రెండు భాగాలుగా తీయడం చూశాం కానీ లవ్ స్టోరీని ఇలా రెండు భాగాలుగా చెప్పాలని ప్రయత్నించడం మంచి విషయం. కన్నడలో సైడ్ B కూడా వర్క్ అవుట్ అయినా మన దగ్గర మాత్రం కేవలం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు