అందరూ లీలగానే...అందుకే అవకాశాలు వదిలేసా!
`కాంతార`తో వెలుగులోకి వచ్చిన కన్నడ బ్యూటీ సప్తమీగౌడ గురించి పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 3 July 2025 10:30 AM`కాంతార`తో వెలుగులోకి వచ్చిన కన్నడ బ్యూటీ సప్తమీగౌడ గురించి పరిచయం అవసరం లేదు. తొలి సినిమాలో నేచురల్ బ్యూటీతో అలరించింది. లంగావోళీ దుస్తుల్లో క్రేజీ బ్యూటీగా పాపులర్ అయింది. 'కాంతార' పాత్రలోనూ కాస్త బోల్డెనెస్ హైలైట్ అయింది. సహజంగా బోల్డ్ సన్నివేశాల్లో సౌత్ నటులు కనిపించడం చాలా అరుదు. సీన్ డిమాండ్ చేస్తే తప్ప అలాంటి ఛాన్స్ తీసుకోరు.
ఆ రకంగా సప్తమీ గౌడ హైలైట్ అయింది. `కాంతార` హిట్ తర్వాత బాలీవుడ్..టాలీవుడ్ లో ఛాన్స్ లందు కుంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా నటించిన `తమ్ముడు`లో నటించింది. ఇదే అమ్మడికి తొలి తెలుగు సినిమా. ఈ సినిమా సహా బాలీవుడ్ లో `థామా`లో నటిస్తోంది. ఇవిగాక కన్నడ సహా ఇతర పరిశ్రమాలో చాలా అవకాశాలు వదులుకున్నట్లు సప్తమీగౌడ రివీల్ చేసింది.
`కాంతార` సక్సెస్ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు వచ్చాయంది. కానీ అవన్నీ కూడా `కాంతార` తరహా పాత్రలనే పోలి ఉన్నాయని..ఆ కారణంగానే వదులుకున్నట్లు తెలిపింది. ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయడం వలన ఉపయోగం ఏంటి? మహా అయితే పారితోషికం అందుకుంటాం. అంతకు మించి ఆ సినిమా ద్వారా తనకు వచ్చే గుర్తింపు అంటూ ఏదీ ఉండదని అభిప్రాయపడింది.
సరిగ్గా అదే సమయంలో `తమ్ముడు` కథ తన వద్దకు రావడం..పాత్ర డిఫరెంట్ గా ఉండటంతో వెంటనే అంగీకరించినట్లు తెలిపింది. పాత్రకు సరిపోతానా? లేదా? అని లుక్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేసారు. నన్ను తప్ప మరో నటిని వాళ్లు కూడా చూడలేదు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారి నేర్చుకోవాలన్నారు. మొదట కాస్త భయమేసినా ధైర్యంగా నేర్చుకున్నానునని తెలిపింది. అలాగే `పుష్ప` సినిమలో రష్మికా మందన్నా పోషించిన శ్రీవల్లి లాంటి పాత్ర పోషించాలని ఉందంది. విభిన్నమైన పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయనని తెలిపింది.