అన్నయ్య సినిమాలో అద్భుతమైన ఛాన్స్!
కమెడియన్ గా మొదలైన సప్తగిరి టాలీవుడ్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. హాస్య నటుడిగా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు.
By: Tupaki Desk | 4 Aug 2025 6:00 PM ISTకమెడియన్ గా మొదలైన సప్తగిరి టాలీవుడ్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. హాస్య నటుడిగా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ పాత్రలతో మెప్పిం చాడు. కమెడియన్ గా పీక్స్ కు చేరిననంతరం హీరోగానూ కొత్త టర్నింగ్ తీసుకున్నాడు. కొంత కాలం అక్కడా సప్తగిరికి తిరుగులేదు. హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రీమేక్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. అలాగని కమెడియన్ పాత్రలకు దూరం కాలేదు. ఓవైపు హాస్య ప్రధాన పాత్రలు పోషిస్తూనే హీరోగానూ కొనసాగాడు.
రేసులో అలా వెనక్కి
ఆ రకంగా రెండు రకాలుగా కెరీర్ ని బ్యాలెన్స్ చేసాడు. కానీ నవతరం నటుల రాకతో సప్తగిరికి అవకాశాలు తగ్గాయి. రెండేళ్ల క్రితం వరకూ పుల్ బిజీగా ఉన్న సప్తగిరి కెరీర్ ఒక్కసారిగా స్లో అయింది. గత ఏడాది కేవలం మూడు సినిమాలే చేసాడు. ఈ ఏడాది చూస్తే ఒక్క సినిమాతోనే అలరించాడు. ఏడాదికి పది-పదిహేను సినిమాలతో ప్రేక్షకుల మధ్యలో ఉండే సప్తగిరి ఒక్కసారిగా డౌన్ అవ్వడం అన్నది అభిమానులకు మింగుడు పడని అంశమే. కమెడియన్ గా సరైన రోల్స్ పడకపోవడం కూడా సప్తగిరి వెనుకబడటానికి ఓ కారణంగా కనిపిస్తుంది.
అనీల్ తో స్నేహితుడు తొలిసారి
ప్రస్తుతం సప్తగిరి చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో సప్తగిరి కోసం ఇండస్ట్రీ ప్రెండ్..స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి సీన్ లోకి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 157వ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో చాలా మంది కమెడియన్లు భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సినిమాలో సప్తగి రికి మంచి రోల్ ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిరంజీవి పాత్రతో పాటు సప్తగిరి రోల్ ట్రావెల్ అవుతుందిట.
ఇద్దరు ఇండస్ట్రీ ప్రెండ్స్
ఇద్దరి మధ్య కామెడీ ట్రాక్ అదిరిపోయే రేంజ్లో డిజైన్ చేసాడుట. ఎంతో కాలంగా సప్తగిరి అనుకుంటోన్న పర్పెక్ట్ రోల్ ఇప్పటికీ పడుతుందని భావిస్తున్నాడుట. అనీల్-సప్తగిరి స్నేహం గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. ఇద్దరు ఇండస్ట్రీ స్నేహితులు. అసిస్టెంట్ డైరెక్టర్లగా కెరీర్ ప్రారంభించారు. అనీల్ ఇప్పటి వరకూ డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసాడు. కానీ వాటిలో ఎక్కడా సప్తగిరి నటించలేదు.
కారణం ఏంటంటే? చిన్న చితకా రోల్ అయితే చేయనని...పెద్ద రోల్ అయితేనే చేస్తాను అనే కండీషన్ సప్తగిరి స్నేహితుడుకి పెట్టాడు. ఆ కారణంగా అనీల్ ఇంత కాలం ఛాన్స్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మంచి పాత్రతో పాటు...అన్నయ్య తో కలిసి నటించే అద్భుతమైన అవకాశం సప్తగిరికి దక్కినట్లు వినిపి స్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.
