Begin typing your search above and press return to search.

'సప్త సాగరాలు దాటి - సైడ్​ బి'.. టీజర్ ఎలా ఉందంటే

టీజర్​ను విడుదల చేసి సినిమా రిలీజ్​ డైట్​ను అనౌన్స్​ చేశారు. వాస్తవానికి విజయ దశమికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్​. కానీ అది కుదరలేదు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:04 AM GMT
సప్త సాగరాలు దాటి - సైడ్​ బి.. టీజర్ ఎలా ఉందంటే
X

రీసెంట్​గా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచిన 'సప్త సాగరాలు దాటి - సైడ్​ ఏ' చిత్రం.. ఈ మధ్యే తెలుగులోనూ విడుదలైంది. కానీ తెలుగులో సినిమా అంతగా క్లిక్ కాలేదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించడంతో పాటు నిర్మించిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర రెండో భాగం 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్​.

టీజర్​ను విడుదల చేసి సినిమా రిలీజ్​ డైట్​ను అనౌన్స్​ చేశారు. వాస్తవానికి విజయ దశమికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్​. కానీ అది కుదరలేదు. దీంతో దీపావళి తర్వాత ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువస్తున్నారు.

ప్రముఖ అగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. నంవబర్ 17న విడుదల చేయనుంది. 'సైడ్‌ ఎ'లో ప్రేమ కథ చూపిస్తే... 'సైడ్‌ బి'లో ఇంటెన్స్‌ యాక్షన్‌ ఉంటుందని క్లైమాక్స్‌లోని చూపించిన గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చింది.

ఈ ప్రచార చిత్రంలో... తొలి భాగంలో సోల్​ను ఎక్కడా మిస్ చేయకుండా ఓ బ్యూటిఫుల్ కట్​తో చూపించారు మేకర్స్​. ప్రస్తుతం అది ఓటీటీలో అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోందని చెప్పారు. టీజర్ లో రాత్రి పూట రక్షిత్ శెట్టి ఓ బిల్డింగ్​పై పడుకున్న సీన్​తో ప్రారంభమై.. తన ప్రేయసి చెప్పే మాటలు వింటున్నట్టుగా డిజైన్ చేసిన సీక్వెన్స్ హైలెట్ గా నిలిచింది.

అయితే ఈ సింగిల్​ టీజర్​లోనే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డైలాగ్స్ పెట్టడం ఇంట్రెస్టింగ్​గా ఉంది. చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ అయ్యింది. ఈ రెండో భాగం కోసం ఇంట్రెస్ట్​గా వెయిట్ చేస్తున్న వారికి.. ఈ టీజర్ మంచి ప్రామిసింగ్ ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తోంది. దర్శకుడు హేమంత్ రావ్ తెరక్కెక్కించిన ఈ అవైటెడ్ సినిమా ఈ నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. మరి సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాలి.