Begin typing your search above and press return to search.

సప్త సాగరాలు దాటి సైడ్ బి ట్రైలర్​.. ఎమోషనల్​ రైడ్​

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్​ ప్రేమ కథా చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్​ రాబోతుంది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 2:08 PM GMT
సప్త సాగరాలు దాటి సైడ్ బి ట్రైలర్​.. ఎమోషనల్​ రైడ్​
X

ఈ మ‌ధ్య క‌న్న‌డ చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, కాంతార, చార్లీ 777 వంటి చిత్రాల త‌ర్వాత ఇక్కడి ఆడియెన్స్​కు అంతలా ఇంపాక్ట్ చేసిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్‌-ఏ. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్​ ప్రేమ కథా చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్​ రాబోతుంది.


ఈ రెండో భాగం విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రంలో.. జైలు నుంచి విడుదలైన మను(హీరో).. తన ప్రేయసి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక బాధపడుతూనే పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసిని మళ్ళీ కలిసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత దేని కోసమో తెలుసుకోవడం కోసం వెళ్లడం, ఈ క్రమంలోనే హీరో ఎవరితోనో తలపడి వారిని బాధతో కత్తి పెట్టి పొడవడం వంటివి సస్పెన్స్​గా చూపించారు. స్టోరీ క్లారిటీగా రివీల్ చేయలేదు.

బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తంగా ఈ ట్రైలర్ ఎమోషనల్​ రైడ్​గా సాగింది. మరి మను తన ప్రేయసితో కోరుకున్న జీవితాన్ని మళ్లీ పొందగలిగాడా లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, తొలి భాగంలో ఓ మిడిల్ క్లాస్ జంట హీరో – హీరోయిన్.. చిన్న జాబ్స్ చేసుకుంటూ సిటీలో లైఫ్​ను హ్యాపీగా బతుకుతుంటారు. అయితే ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసును డబ్బుల కోసం ఒప్పుకొని, త్వరగా బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని హీరో జైలుకి వెళ్తాడు. హీరోయిన్ ఒప్పుకోకపోయినా ఆ పని చేస్తాడు. కానీ కేసు ఒప్పుకోమని హామీ ఇచ్చిన వ్యక్తి చనిపోవడం, హామి ఇచ్చిన వ్యక్తి వద్ద పని చేసే వేరే వ్యక్తి కుట్ర పన్నీ.. మనును జైలులోనే ఉంచేలా చేయడం.. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హీరో పదేళ్లు జైలులోనే ఇరుక్కుపోవడం జరుగుతుంది.

అలా సైడ్ ఏలో అందంగా, ఎమోషనల్​గా చూపించారు. మరి ఇప్పుడా సైడ్ బీలో జైలు నుంచి బయటకి వచ్చిన హీరో ఏం చేశాడనేది తెరపై చూడాలి. ఈ రెండో భాగం న‌వంబ‌ర్ 17న కన్నడ, తెలుగుతో పాటు మరో భాషలోనూ రిలీజ్ అవుతోంది. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు.