Begin typing your search above and press return to search.

ఆ హీరో కెరీర్ లో మ‌రో క్లాసిక్ హిట్!

నాలుగేళ్ల‌గా క‌న్న‌డ‌..మ‌ల‌యాళం సినిమాలు పాన్ ఇండియాలో మంచి గుర్తింపును ద‌క్కించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Sep 2023 6:11 AM GMT
ఆ హీరో కెరీర్ లో మ‌రో క్లాసిక్ హిట్!
X

నాలుగేళ్ల‌గా క‌న్న‌డ‌..మ‌ల‌యాళం సినిమాలు పాన్ ఇండియాలో మంచి గుర్తింపును ద‌క్కించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కంటే విష‌యం ఉన్న సినిమానే ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'కేర‌ళ స్టోరీ'..'2018'..'ల‌వ్ టుడే' అంద‌రూ హీరోలే లాంటి సినిమాలు స‌క్సెస్ అయ్యాయి! అంటే కార‌ణం వాటిలో కంటెట్ ప్ర‌ధాన‌మే.

ఈ నేప‌థ్యంలో తెలుగులోనూ అక్క‌డ చిత్రాల్ని తీసుకొచ్చి రీమేక్ చేసే విధానం స్పీడ‌ప్ అయింది. ఒక‌ప్పుడు ఆ రెండు భాష‌ల సినిమాలు కేవ‌లం అక్క‌డికే ప‌రిమిత‌య్యేవి. ఇప్పుడు దేశం మొత్తం ఫేమ‌స్ అవుతున్నాయి. తాజాగా అలాంటి క‌న్న‌డ సినిమా మ‌రొక‌టి రిలీజ్ అయింది. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ 'స‌ప్త సాగ‌ర‌దాచె ఎల్లో'. ఈ మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీకి హేమంత్ .ఎమ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించింది. రిలీజ్ అయిన అన్ని చోట్లా సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. హైద‌రాబాద్ లో కూడా కొన్ని థియేట‌ర్లో రిలీజ్ అయింది. షోలు అన్ని హౌస్ ఫుల్ అవుతున్నాయి. సాధార‌ణంగా ప్రేమ క‌థ‌లు ఎప్పుడు సుఖాంత‌మ‌వుతాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివ‌రికి ప్రేమ వాళ్ల‌ని గెలిపిస్తుంది అనే ఓ న‌మ్మ‌కం మీద క‌థలు సాగుతాయి. కానీ సప్త సాగర దాచే ఎల్లో అందుకు భిన్నంగా సాగుతుంది.

మ‌ను- ప్రియ‌ కలయికతో సినిమా మొదలై విడిపోవడంతో ఎండ్ అవుతుంది. ఎమోష‌న‌ల్ గా సినిమా క‌నెక్ట్ అవుతుంది. ప్రేమ క‌థ‌లు ఎప్పుడు ఎవ‌ర్ గ్రీన్ గా బ్యాక్ డ్రాప్ ఉన్న‌ప్పుడే ఆక‌ట్టుకుంటాయి. స‌ప్త సాగ‌రదా చె ఎల్లో మూవీ పూర్తిగా జైలు బ్యాక్‌డ్రాప్ లో సాగుతుంది. చేయ‌ని నేరానికి జైలు పాలైన ఓ యువ‌కుడు ఆ నేరం నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాకుండా త‌న ప్రియురాల్ని క‌ల‌వ‌డానికి ప‌డే త‌ప‌న‌ను హృద్యంగా స్క్రీన్‌పై చూపించారు . చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను అత‌డు ఎందుకు త్యాగం చేశాడ‌నే క్లైమాక్స్ సీన్ మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. ఈ క‌థ‌ని సంగీతం నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లింది.