Begin typing your search above and press return to search.

తమ్ముడు కోసం హీరోయిన్ సూపర్ డెడికేషన్..!

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష, లయ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

By:  Tupaki Desk   |   2 July 2025 8:15 AM IST
తమ్ముడు కోసం హీరోయిన్ సూపర్ డెడికేషన్..!
X

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష, లయ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ మూవీపై సూపర్ బజ్ ఏర్పరిచాయి. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమ్ముడు కథానాయిక సప్తమి గౌడ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు.

తమ్ముడు సినిమాలో తాను రత్న పాత్రలో నటించానన్న సప్తమి గౌడ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తానని అన్నది. కాంతార తర్వాత తనకు అలాంటి పాత్రలే వచ్చాయి ఐతే కాంతార తర్వాత శ్రీరాం వేణు తమ్ముడు కోసం అడిగారు. లుక్ టెస్ట్ చేసి ఓకే అయ్యాక డైలాగ్ వెర్షన్ చెప్పారని అన్నారు. ఐతే ఈ సినిమా కోసం తాను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని అరకులో షూటింగ్.. కొడలు,ం గుట్టల్లో హార్స్ రైడింగ్ చేశానని ఈ సినిమాకు పనిచేయడం ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ అన్నారు సప్తమి గౌడ.

సినిమాలో రత్న పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. హీరోతో లవ్ ట్రాక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు సప్తమి. అంతేకాదు రత్న క్యారెక్టర్ ద్వారా చాలా ఫన్ వస్తుందని అన్నారు. హీరో అతని సోదరి అంబరగొడుగు వచ్చినప్పుడు వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అన్నది ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు సప్తమి గౌడ.

తమ్ముడు సినిమాలో లయ, దిత్య, వర్ష, స్వసిక తో పాటు రత్న పాత్ర కూడా కీలకం. సినిమాలో నేను వర్ష యాక్షన్ సీన్స్ కూడా చేశాం. తమ్ముడు సినిమాలో మహిళా పాత్రలను బలంగా తెరకెక్కించారు ఆడియన్స్ అందుకు హ్యాపీగా ఫీల్ అవుతారని అన్నారు సప్తమి గౌడ.

ఇక తనకు పుష్ప సినిమాలో రష్మిక పాత్ర బాగా నచ్చిందని చెప్పిన సప్తమి గౌడ అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. కాంతార తర్వాత ఆఫర్లు వచ్చినా సరైన పాత్రలు రాకపోవడం వల్లే ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. డిఫరెంట్ రోల్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానంటున్నారు. తెలుగులో తమ్ముడు తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ తమిళ్, కన్నడలో కూడా సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించారు.