Begin typing your search above and press return to search.

సీ అందంలో సోనారికా కెర‌టంలా!

కానీ వాటి ఫ‌లితాలు తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి. దీంతో అమ్మ‌డు సినిమాల‌కే దూర‌మైంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 5:29 AM GMT
సీ అందంలో సోనారికా కెర‌టంలా!
X

ముంబై బ్యూటీ సోనారికా భాండియారి సుప‌రిచితమే. `జాదుగాడు` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై `స్పీడున్నోడు`..`ఈడోర‌కం ఆడోర‌కం` అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఏ సినిమా సోనా రికాకి క‌లిసిరాలేదు. మూడు కూడా ఒక‌దాన్ని మించిన ఒక‌టి గా వైఫ‌ల్యాలు అందించిన చిత్రాలే. దీంతో అమ్మ‌డు ఒక్క‌సారిగా టాలీవుడ్ కి దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో బాలీవుడ్ లో `సాన్ సేన్` లో...కోలీవుడ్ లో `ఇంద్ర‌జిత్` చిత్రాల్లోఅవ‌కాశాలు అందుకుంది.


కానీ వాటి ఫ‌లితాలు తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి. దీంతో అమ్మ‌డు సినిమాల‌కే దూర‌మైంది. ఇదంతా నాలుగేళ్ల క్రితం నాటి స్టోరీ. చివ‌రిగా గ‌తేడాది బాలీవుడ్ లో `హిందుత్వ` అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత అక్క‌డా క‌నుమ‌రుగైంది. ఇలా సోనారిక వెండి జీవితం ఎటూ చూసినా అసంపూర్ణంగానే క‌నిపి స్తుంది. అయితే వెండి తెర‌కు ఎంట్రీ ఇచ్చే ముందు బుల్లి తెర‌పైనా మెరిసింది.


ఆ ర‌కంగా న‌టన ప‌రంగా అనుభ‌జ్ఞురాలైనా..అందం..అభిన‌యం గ‌ల నాయికైనా వైఫ‌ల్యాలు వెనక్కి నెట్టేసాయి. అయినా సోనారికా ఇన్ స్టా సంచ‌ల‌నాలు మాత్రం ఆగ‌లేదు. గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ త‌న‌దైన మార్క్ వేస్తూనే ఉంది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో అమ్మ‌డు సెగ‌లు పుట్టిస్తూనే ఉంది. యువ‌త‌ని ఆక‌ర్షించే భంగిమ‌ల‌తో వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీస్తూనే ఉంది.


తాజాగా అమ్మ‌డు మ‌రో టెం....గ్ ట్రీట్ తో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా బీచ్ గ‌ట్టున నిల‌బ‌డి కెమెరాకి ఫోజులిచ్చింది. ఇందులో సోనారిక ప‌చ్చ రంగు దుస్తుల్లో క‌నిపిస్తుంది. క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి సీ అందాల్ని ఆస్వాదించ‌డం చూడొచ్చు. గాలికి కురులు ఆర‌బోస్తూ వెనుక నుంచి క్యాప్చ‌ర్ చేసిన పిక్ ఇది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. సోనారికా అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.