Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ లేదు.. ఛాన్సులే ఛాన్సులు!

సంతోష్ శోభన్ హీరోగా మిస్టర్ ప్రొడక్షన్స్ ఇన్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ బ్యానర్ కు ఇదే తొలి సినిమా. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెప్టెంబర్ 20న లాంఛ్ చేయబోతున్నారట.

By:  Tupaki Desk   |   19 Sep 2023 1:34 PM GMT
ఒక్క హిట్ లేదు.. ఛాన్సులే ఛాన్సులు!
X

తెలుగు చిత్రపరిశ్రమలో ఓ హీరోకు సక్సెస్ లేకున్నా ఛాన్సులు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. అతడు మరెవరో కాదు టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సంతోష్ శోభన్. సింపుల్ అండ్ నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకోగలడు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజ్ తో చేయగలడు. ముఖ్యంగా బాగా నవ్వించగలడు. కానీ అతడిని మాత్రం సక్సెస్ అనే అదృష్టమే పలకరించి చాలా కాలమే అయిపోయింది. అయినప్పటికీ అతడికి సక్సెస్ అదృష్టం లేకపోయినా ఆఫర్స్ లక్ అనేది తోడుగానే నిలుస్తూ వస్తోంది. అందుకే తనకు చేతికి వచ్చిన ప్రతి సినిమాని చేస్తూనే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం అస్సలు దొరకడం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా అతడికి మరో ఆఫర్ వరించింది.

సంతోష్ శోభన్ హీరోగా మిస్టర్ ప్రొడక్షన్స్ ఇన్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ బ్యానర్ కు ఇదే తొలి సినిమా. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెప్టెంబర్ 20న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారట. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా రావడం విశేషం.

అయితే సంతోశ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టే నాటికి ఆయన.. నిర్మాత అయిన తన తండ్రిని కోల్పోయారు. కానీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరో అండగా ఉండడంతో.. చిత్రసీమలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద సపోర్ట్ ఉన్నా, చేయడానికి చేతికి చాలా సినిమా అవకాశాలు వస్తున్నా.. అతడు మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడనే చెప్పాలి. అతడికి వరసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 2011 గోల్కొండ హైస్కూల్ అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచమైన సంతోశ్ కు... ఆ తర్వాత హీరోగా మారడానికి పెద్దగా సమయమేమీ పట్టలేదు. 2015లో హీరోగా తను నేను చిత్రంతో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి గత 8 ఏళ్లలో దాదాపు 9 సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో తన రెండో చిత్రం 2018లో వచ్చిన పేపర్ బాయ్ మంచి గుర్తింపుతో పాటు కలెక్షన్స్ విషయంలోనూ పర్వాలేదనిపించింది. అనంతరం లాక్‌డౌన్ తర్వాత నేరుగా 2021లో ఓటీటీలో రిలీజైన ఏక్ మినీ కథ అయితే సంతోశ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారుతుందనిపించేలా మంచి ఆదరణే అందుకుంది.

వైవిధ్యభరితమైన కథతో కాస్త బోల్డ్ టచ్ ఇస్తూ అతడు సినిమాను చేయడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. కానీ ఏక్ మినీ కథ తర్వాత అతడు అదే హిట్ ట్రాక్‌ను కొనసాగించలేకపోయాడు. అదే ఏడాది 2021లో మంచి అంచనాలతో వచ్చిన మంచిరోజులొచ్చాయి నిరాశపరిచింది. 2022లో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ కూడా అంతే కామెడీని పండించినా వర్కౌట్ అవ్వలేదు.

కానీ రెండు వరుస ఫ్లాప్ లు పడినా అవకాశాలు క్యూ కట్టాయి. 2023లో అంటే ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కళ్యాణం కమణీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్.. చిత్రాలతో పలకరించినా అవి నిరాశపరిచాయి. అలా 2021 ఏక్ మినీ కథ తర్వాత నుంచి ఫ్లాప్ లు కొడుతున్నా అవకాశాలు ఆగట్లేదు. ఈ ఏడాది ఇంకా పూర్తి కూడా కాలేదు. అప్పుడే ఐదో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చేయబోతున్నాడు. అదే మిస్టర్ ప్రొడక్షన్స్ ఇన్ బ్యానర్ లో సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. చూడాలి మరి ఈ సినిమా అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో, సంతోశ్ కు హిట్ ను అందిస్తుందో లేదో...