Begin typing your search above and press return to search.

శ్రీవారికి అవమానం... రోడ్డున పోయే వారికి సమాధానం చెప్పను

సెన్సార్‌ బోర్డ్‌ క్లియరెన్స్ వచ్చిన సినిమా విషయంలో వివాదం ఏంటి అంటూ కొందరు సంతానం మరియు చిత్ర యూనిట్‌ సభ్యులకు మద్దతుగా నిలుస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2025 2:19 PM
శ్రీవారికి అవమానం... రోడ్డున పోయే వారికి సమాధానం చెప్పను
X

కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్స్‌ అనగానే ఠక్కున వినిపించే పేర్లలో సంతానం పేరు ముందు ఉంటుంది. కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సంతానం ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. తాజాగా ఈయన ముఖ్య పాత్రలో నటించిన డెవిల్స్ డబుల్‌ నెక్ట్స్ లెవల్‌ సినిమా విడుదలకు సిద్ధం అయింది. సినిమా నుంచి ట్రైలర్‌, టీజర్ వచ్చింది. సినిమా ప్రమోషనల్ వీడియోలు సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ వచ్చింది. సినిమాను మే 16న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ సమయంలో మేకర్స్‌కి కొందరు షాక్‌ ఇచ్చారు.

'డెవిల్స్ డబుల్‌ నెక్ట్స్‌ లెవల్‌' సినిమాలో తిరుమల శ్రీవారిని అవమానించే విధంగా సతానం పాటను పెట్టాడని, ఆ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాల వారు ఇప్పటికే సంతానంకు వ్యతిరేకంగా ఆందోళన మొదలు పెట్టారు. ఆయన ఆఫీస్‌ వద్ద హడావుడి చేయడంతో పాటు, సినిమాలో స్వామి వారి పాట ఉంటే, అది పేరడీగా ఉంటే కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు. అంతే కాకుండా సినిమాను ముందే హిందూ సంఘాల వారికి చూపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. హిందువులు చేస్తున్న వ్యాక్యలు, విమర్శలపై సంతానం స్పందించాడు.

గోవింద పాటను పేరడీ చేసినట్లు వస్తున్న వార్తలపై సంతానం స్పందిస్తూ... తాము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీసి ఉన్నా కచ్చితంగా మాకు సెన్సార్‌ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు. సెన్సార్‌లో మాకు అన్ని విధాలుగా పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కింది. కనుక మేము సినిమాను ఎప్పుడు ఎప్పుడు విడుదల చేద్దామా అని ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చాడు. సెన్సార్‌ బోర్డ్‌ నిబంధనలకు అనుగుణంగానే సినిమాను రూపొందించాం, ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా వ్యవహరించలేదు. కనుక మేము రోడ్డున పోయేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సంతానం చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు హిందూ సంఘాలను మరింతగా రెచ్చగొట్టే అవకాశం ఉంది.

సెన్సార్‌ బోర్డ్‌ క్లియరెన్స్ వచ్చిన సినిమా విషయంలో వివాదం ఏంటి అంటూ కొందరు సంతానం మరియు చిత్ర యూనిట్‌ సభ్యులకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం హిందూ దేవతలను అగౌరవ పరిచే సినిమాలను బ్యాన్‌ చేయాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి డెవిల్స్ డబుల్‌ నెక్ట్స్ లెవల్‌ సినిమాకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున పబ్లిసిటీ దక్కింది. సినిమాలోని ఆ ఒక్క పాటను తొలగించి విడుదల చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సంతానం రిస్క్ తీసుకుంటాడా లేదంటే ఆయన ఎవరు ఏం అనుకుంటే నాకేంటి అని ముందుకు వెళ్తాడా అనేది చూడాలి.