కమెడియన్ ఇల్లు కూల్చివేతకు ఈ స్టార్ హీరో కారణం?
తమిళ స్టార్ హీరో ఆర్య, కామెడీ హీరో సంతానం చాలా కాలంగా మంచి స్నేహితులు. కష్టకాలంలో ఒకరికోసం ఒకరు నిలబడేంత మంచి స్నేహితులు.
By: Tupaki Desk | 11 May 2025 5:00 AM ISTతమిళ స్టార్ హీరో ఆర్య, కామెడీ హీరో సంతానం చాలా కాలంగా మంచి స్నేహితులు. కష్టకాలంలో ఒకరికోసం ఒకరు నిలబడేంత మంచి స్నేహితులు. అయితే ఆర్య ఎగ్రెస్సివ్ స్వభావం కారణంగా తాను చాలాసార్లు చిక్కులు ఎదుర్కొన్నానని సంతానం చెప్పారు. ఆర్య కారణంగా, అనూహ్యంగా తన సొంత ఇల్లు కూల్చుకునేవరకూ వెళ్లిందని చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే....
సంతానం ఇంతకుముందు ఒక ఇంటిని కొనుగోలు చేసాడు. కానీ ఆ ఇంటిని ఆర్య కూలగొట్టించాడు. నిజానికి ఆ ఇంటిని కొనుగోలు చేసిన అనంతరం దానిని రిపేర్లు చేయించి దిగాలనుకున్నారు. ఇంట్లో గృహప్రవేశం చేయక ముందే తన భార్య, అమ్మ ఇద్దరూ ప్రతి శుక్రవారం వచ్చి పూజాకార్యక్రమాలు చేసి వెళ్లేవారు. ఇది తమ కొత్త ఇల్లు అని తెగ మురిసిపోయేవారు. కానీ వన్ ఫైన్ డే వారు పూజ కోసం శుక్రవారం నాడు ఆ చోటికి వచ్చి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దానికి కారణం అక్కడ ఇల్లు లేదు. పైగా శుభ్రంగా క్లీన్ చేసిన ఒక ఖాళీ స్థలం కనిపించింది. ఇది చూసేప్పటికి నిజంగానే వారంతా షాక్ కి గురయ్యారు.
అంతకుముందు ఏం జరిగింది? అంటే.. సంతానం తన ఇంటి పునర్నిర్మాణం గురించి ప్లాన్ చేస్తుండగా, ఆర్య వచ్చి దానిని పడగొట్టాలని సూచించాడు. ఒక గంటలోనే ఇల్లు పడగొట్టడంలో స్పెషలిస్ట్ అక్కడికి వచ్చాడు. నాలుగు రోజుల్లోనే అక్కడ ఇల్లు లేకుండా చేసాడు. అది చూసి సంతానం కూడా షాక్ తిన్నాడు. ఐదో రోజుకు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఖాళీ స్థలం దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆ స్థలం వద్దకు వచ్చిన సంతానం తల్లి, భార్య ఇది తమ ఇల్లు ఉండే చోటు కాదనుకుని పక్క వీధుల్లో వెతకడం ప్రారంభించారు. దానికి కారణం ఇల్లు కూలగొడుతున్నట్టు తన సతీమణికి కానీ, తన తల్లి కి కానీ తెలియనే తెలీదని సంతానం చెప్పాడు. తాను ఎంత వారించినా కాదని మొండిగా ఆర్య ఇల్లు పడగొట్టించాడు. బడ్జెట్ పెరిగిపోతుందని కూడా భయపడ్డాడు. కానీ ఆర్య మొండితనాన్ని కాదనలేక గత్యంతరం లేక చివరికి ఒప్పుకున్నానని చెప్పాడు. సంతానం నటించిన తాజా చిత్రం ఆడియో లాంచ్ వేడుకలో ఈ విషయాలను అతడు తనదైన హాస్యచతురతతో వివరించి చెప్పడం అందరినీ నవ్వించింది.