Begin typing your search above and press return to search.

సంతాన ప్రాప్తిరస్తు నుంచి 'నాలో ఏదో'.. లవ్లీ మెలోడి!

తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి నాలో ఏదో సాంగ్ ను రిలీజ్ చేశారు. చెప్పలేని లోతుగా అనుభూతి చెందే ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   8 May 2025 2:21 PM IST
సంతాన ప్రాప్తిరస్తు నుంచి నాలో ఏదో.. లవ్లీ మెలోడి!
X

టాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ విక్రాంత్, చాందినీ చౌదరీ హీరోహీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ ఫేమ్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నేచురల్ గా నిర్మిస్తున్నారు.

వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్, ఎక్స్‌ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్.. సంతాన ప్రాప్తిరస్తు మూవీకి వర్క్ చేయడం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ప్రమోషన్స్ తో మేకర్స్ వాటిని పెంచుతూనే ఉన్నారు.

అయితే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ టీజర్ ఇప్పటికే సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించింది. ఫన్, ఎమోషన్‌ తో పాటు ప్రస్తుత తరం యూత్ ఎదుర్కొంటున్న కన్సీవ్ సమస్యను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా సినిమాను డిజైన్ చేస్తున్నట్లు ఇప్పటికే టీజర్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది.

తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి నాలో ఏదో సాంగ్ ను రిలీజ్ చేశారు. చెప్పలేని లోతుగా అనుభూతి చెందే ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సునీల్ కశ్యప్ బాణీలు కట్టిన ఆ పాటకు శ్రీజో లిరిక్స్ అందించారు. వాటికి అదితి భవరాజు తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రస్తుతం సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాలో ఏదో మొదలైందని.. నీతో చెలిమే రుజువైందని.. అంటూ సాగుతున్న సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మెలోడియస్ గా ఉందని నెటిజన్లు, మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తోంది. సంగీతం.. లిరిక్స్.. గాత్రం.. అన్నీ సూపర్ గా ఉన్నాయని కొనియాడుతున్నారు. సాంగ్ చాలా బాగుందని ఇప్పుడు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అయిన హీరో.. హీరోయిన్ ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తుంటారు. అయితే హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో పేరెంట్స్ అవ్వడంలో సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దీంతో స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు డైట్ ఫాలో అవుతుంటారు. 100 రోజుల్లో భార్యను ప్రెగ్నెంట్ చేయాలని చూస్తారు. మరి చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది.