Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల్లో డామినేషన్ ఎవరిది..?

సంక్రాంతికి వచ్చింది అంటే కొత్త సినిమాల పండుగ వచ్చినట్టే లెక్క. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్య ఫైట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది

By:  Tupaki Desk   |   5 Jan 2024 6:41 AM GMT
సంక్రాంతి సినిమాల్లో డామినేషన్ ఎవరిది..?
X

సంక్రాంతికి వచ్చింది అంటే కొత్త సినిమాల పండుగ వచ్చినట్టే లెక్క. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్య ఫైట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటిలానే సంక్రాంతి ఫైట్ కి స్టార్స్ అంతా రెడీ అయ్యారు. ఈ పొంగల్ రేసులో సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామిరంగ వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటుగా ప్రశాంత్ వర్మ తేజా సజ్జా చేసిన హనుమాన్ కూడా వస్తుంది. అయితే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మాస్ రాజా రవితేజ ఈగల్ సినిమా ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. అసలు సంక్రాంతి రిలీజ్ అంటూ ముందు అనౌన్స్ చేసిన రవితేజ ఈగల్ వాయిదా పడాల్సి రావడం మాస్ రాజా ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్న ప్రస్తుత సినిమాల్లో డామినేషన్ ఎవరిదని ఒక్కసారి చూస్తే అందరు చెప్పే పేరు ఒక్కటే అదే సూపర్ స్టార్ మహేష్ మాస్ ర్యాంపేజ్. మహేష్ లోని ఊర మాస్ యాటిట్యూడ్ ని త్రివిక్రం లాంటి క్లాస్ డైరెక్టర్ డైరెక్షన్ లో చేయడం గుంటూరు కారం మీద స్పెషల్ ఫోకస్ ఉంచేలా చేసింది. మామూలుగానే మహేష్ సినిమాలకు సూపర్ బజ్ ఉంటుంది. త్రివిక్రం తో సినిమా అనేసరికి అది డబుల్ అయ్యింది. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా గుంటూరు కారం మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి.

త్రివిక్రం మహేష్ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఖలేజా థియేట్రికల్ వెర్షన్ హిట్ కాకపోయినా టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్ ఫాం లో మాత్రం హిట్ అయ్యింది. ఈ కాంబో లో 12 ఏళ్ల తర్వాత గుంటూరు కారం వస్తుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మహేష్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలతో పాటుగా త్రివిక్రం మార్క్ ఎమోషనల్ టచ్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.

సంక్రాంతికి వెంకటేష్ సైంధవ్ న్యూ ఏజ్ యాక్షన్ మూవీగా వస్తుంది. శైలేష్ కొలను సినిమాను వెంకీ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి బాగా ఎక్కేలా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక కింగ్ నాగార్జున నా సామిరంగ పక్కా సంక్రాంతి సినిమాగా వస్తుంది. సన్ర్కాంతి అంటే చాలు నాగ్ సినిమా వస్తుంది హిట్ కొడుతుంది అన్న సెంటిమెంట్ ఏర్పడింది. అదే తరహాలో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నా సామిరంగ అంటూ వస్తున్నాడు నాగార్జున.

ఇక వీటితో పాటుగా ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా హనుమాన్ వస్తుంది. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో తేజా సజ్జ నటన ఆకట్టుకుంటుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో విజువల్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయని చెబుతున్నారు.

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో మహేష్ గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సెకండ్ థర్డ్ ప్లేస్ లో వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలు ఉన్నాయి. ఇక చివరి ప్రియారిటీగా హనుమాన్ ఉంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అన్నది చూడాలి.