Begin typing your search above and press return to search.

సంక్రాంతికి ఒక్కరు తప్పుకుంటే.. మరో నలుగురి ఎంట్రీ?

దీంతో కోలీవుడ్ లో కూడా నాలుగు సినిమాలు పొంగల్ బరిలో ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాయని స్పష్టం అయ్యింది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 3:42 AM GMT
సంక్రాంతికి ఒక్కరు తప్పుకుంటే.. మరో నలుగురి ఎంట్రీ?
X

టాలీవుడ్ లో సంక్రాంతి ఫెస్టివల్ కి ఏకంగా ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకం కావడంతో అన్నింటి మీద అంచనాలు అయితే ఉన్నాయి. ఏ మూవీ సక్సెస్ అవుతుందనేది అప్పుడే చెప్పలేం. ఇక కోలీవుడ్ లో కూడా సంక్రాంతి పొంగల్ రేసులో గట్టి పోటీనే ఉంది. మొన్నటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలామ్ కూడా ఉండేది.

ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో మూవీ చేసింది. అయితే ఫెస్టివల్ సీజన్ ఫుల్ టైట్ గా ఉండటంతో ఈ మూవీ రిలీజ్ ని జనవరి 25కి పొడిగించినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ గా కూడా ప్రకటన వచ్చింది. ఈ మూవీ వాయిదా పడటంతో అరుణ్ విజయ్ మిషన్ మూవీ పొంగల్ రేసులోకి వచ్చింది.

దీంతో కోలీవుడ్ లో కూడా నాలుగు సినిమాలు పొంగల్ బరిలో ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాయని స్పష్టం అయ్యింది. వాటిలో ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ అవుతోంది. శివ కార్తికేయన్ అయలాన్ కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా హిందీ, తమిళ్ భాషలలో తెరకెక్కిన మేరీ క్రిస్మస్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది.

లాల్ సలామ్ సినిమా వాయిదా పడటంతో ఈ నాలుగు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి సరిపడా థియేటర్స్ తమిళనాడు రాష్ట్రంలో దొరుకుతాయి. అయితే శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ తెలుగులో ఐదు సినిమాలకి థియేటర్స్ సరిపడినంత లేకపోవడంతో డబ్బింగ్ మూవీస్ కి ఇచ్చే ఛాన్స్ లేదని టాక్.

ఒక వేళ ఇచ్చిన కూడా సింగిల్ డిజిట్ స్క్రీన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ తెలుగు మార్కెట్ కూడా కావాలని అనుకుంటే మాత్రం ధనుష్, శివ కార్తికేయన్ పొంగల్ రేసు నుంచి తప్పుకోవాల్సింది.