2026 లో 2023 క్లాష్ రిపీట్!
2026 లో 2023 క్లాష్ రిపీట్ అవుతుందా? స్టార్ల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ముగ్గురు సై అంటే సై అంటున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 21 April 2025 1:48 PM IST2026 లో 2023 క్లాష్ రిపీట్ అవుతుందా? స్టార్ల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ముగ్గురు సై అంటే సై అంటున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా ముగ్గురు స్టార్లు. ఆ క్లాష్ ఎప్ప డొస్తుంది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శక త్వంలో 157వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ కి వెళ్లక ముందే 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే నటసింహ బాలకృష హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్ టైనర్ కి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో `అఖండ2` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధిలో మరో సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని బాలయ్య ప్లాన్ చేసుకుని సంక్రాంతికి ఫిక్సైనట్లు తెలుస్తోంది.
అలాగే దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న `జననాయగన్` చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు హీరోల మధ్య క్లాష్ ఏర్పడుతుంది. అయితే ఈ క్లాష్ కొత్తేం కాదు. రెండేళ్ల క్రితం జరిగిన క్లాష్ మళ్లీ 2026లో ఏర్పడుతుంది. చిరంజీవి హీరోగా నటించిన `వాల్తేరు వీరయ్య`, విజయ్ నటించిన `వారసుడు`, బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` సినిమాలు 2023 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యాయి.
మూడు భారీ విజయం సాధించాయి. విజయ్ వారసుడు కి డివైడ్ టాక్ వచ్చినా? పెయిల్యూర్ మాత్రం కాలేదు. బాలయ్య, చిరంజీవి సినిమాలు మాత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని మోతెక్కించాయి. అంతకు ముందు రిలీజ్ అయిన మెగాస్టార్, సింహం సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ నమ్మకంతోనే స్టార్ హీరోలంతా మరోసారి 2026 సంక్రాంతిపై గురి పెడుతున్నారు.
