2026 సంక్రాంతి... వార్ వన్ సైడ్ కాదు
సంక్రాంతికి వచ్చే సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మినిమం ఉంటాయి.
By: Tupaki Desk | 1 May 2025 6:30 AM2025 సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చాయి. మూడు సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ది పై చేయి అవుతుందని విడుదలకు ముందు అంతా అనుకున్నారు. మూడు సినిమాల్లో అత్యధిక బడ్జెట్ మూవీగా గేమ్ ఛేంజర్ నిలిచింది. ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమా సైతం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కానీ విడుదల ముందు హడావుడి మొదలు పెట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి 2026 సంక్రాంతికి సినిమా రాబోతుంది.
2026 సంక్రాంతికి రాబోతున్న సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎలాగైతే వార్ వన్‌సైడ్ అయిందో చిరంజీవి-రావిపూడి మూవీకి సైతం వార్ వన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితి అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా సైతం విడుదల కాబోతుంది. సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే ఒక మోస్తరు అంచనాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్, అంతే కాకుండా ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. మూడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సంక్రాంతికి అఖండ 2 వస్తే కచ్చితంగా పోటీ చాలా కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా థియేటర్ల విషయంలోనూ పోటీ తీవ్రంగా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, చిరంజీవి సంక్రాంతికి పోటీ పడటం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో పోటీ పడ్డ సమయంలో వార్ వన్ సైడ్ ఎప్పుడూ కాలేదు. ఇద్దరు హీరోలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే ఈ సంక్రాంతికి కచ్చితంగా పరిస్థితి సీరియస్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
సంక్రాంతికి వచ్చే సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మినిమం ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం మేకర్స్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది. కనుక అప్పటి వరకు మరో రెండు సినిమాలు సైతం ఈ పోటీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు రాబోయే సంక్రాంతికి మరోసారి తమ సత్తా చాటుతారా అనేది చూడాలి. ఈ ఏడాదిలోనే చిరంజీవి విశ్వంభర సినిమాతో రాబోతున్నాడు. అనిల్ రావిపూడి మూవీ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా కూడా 2026 సంక్రాంతికి వస్తుందనే ధీమా వ్యక్తం అవుతోంది. ఒక యంగ్ హీరో సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.