సంక్రాంతి సామ్.. ఎంత అందమే..
పూర్తిగా ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేసుకుందట.
By: Tupaki Desk | 16 Jan 2024 2:03 AM ISTటాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరిగా ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమా పూర్తయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడే విశ్రాంతి తీసుకుంటోంది. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేసుకుందట. ఇప్పటికే కొన్ని నెలలు సమయాన్ని అక్కడే గడిపేస్తోంది.
ఇటీవలే న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా విదేశాల్లోనే చేసుకుంది సామ్. ఓ బీచ్ ఒడ్డున వేడుకలను జరుపుకుంది. నైట్ వేర్ డీప్ బ్యాక్ లో అందాలను ప్రదర్శిస్తూ స్టన్నింగ్ పోజులిచ్చింది. అందుకు సంబంధించిన పిక్.. ఓ రేంజ్ లో వైరల్ అయింది. తాజాగా సంక్రాంతిని సమంత సింపుల్ గా చేసుకుంది. అందుకు సంబంధించిన పది పిక్స్ ను షేర్ చేసింది. ఒక్కో ఫొటోకు సింపుల్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఫస్ట్ పిక్ లో బ్రౌన్ కలర్ లాంగ్ డ్రెస్ లో హ్యాపీ మూడ్ లో స్మైల్ తో ఆకట్టుకుంటోంది సామ్. ఇక రెండు, మూడు ఫొటోల్లో గాలిపటం ఎగరేసినట్లు చెప్పింది. భోగీ మంట వేసుకున్నట్లు ఫోర్త్ ఫొటోలో చెప్పింది. పెద్ద పండుగ సందర్భంగా తలంటు స్నానం చేసినట్లు ఐదో పిక్ ద్వారా చెప్పింది. సంక్రాంతి స్పెషల్ రంగోలిని షేర్ చేసింది. ఏడో ఫొటోలో పూలను, ఎనిమిదో పిక్ లో ఇంటి డెకరేషన్ ను చూపించింది. ఇక లాస్ట్ రెండు పిక్స్ లో తన పెట్స్ ను చూపించింది.
ప్రస్తుతం సామ్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. సమంత సెలబ్రేషన్స్ సింపుల్ గా అదిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి విషెస్ చెబుతున్నారు. హ్యాపీ మోడ్ లో సమంత చాలా కూల్ గా ఉందని అంటున్నారు. సామ్ ను అలా చూడడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
అయితే సమంత కమ్ బ్యాక్ తర్వాత బాలీవుడ్ సినిమా చేస్తుందా లేదా టాలీవుడ్ సినిమా చేస్తుందో అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే బాలీవుడ్ లో సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్లు కూడా రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఎంతవరకు వచ్చిందనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు.
సమంత వెళుతూ వెళుతూ బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ లు చేసేలా ప్లాన్ చేసుకుని
వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ పరిశ్రమలో సమంత నిలదొక్కుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అలాగే హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి వీటిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
