Begin typing your search above and press return to search.

2025 సంక్రాంతికి కూడా రెడీ అయిపోతున్న స్టార్ హీరోలు!

వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మూడు నెలల మాత్రమే ఉంది. ఆ సమయంలో ప్రేక్షకుల ముందుకి రావడానికి ఏకంగా అరడజనుకి పైగా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:25 AM GMT
2025 సంక్రాంతికి కూడా రెడీ అయిపోతున్న స్టార్ హీరోలు!
X

వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మూడు నెలల మాత్రమే ఉంది. ఆ సమయంలో ప్రేక్షకుల ముందుకి రావడానికి ఏకంగా అరడజనుకి పైగా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటితో పాటు తమిళం నుంచి రెండు సినిమాలు డబ్బింగ్ వెర్షన్స్ తో వస్తున్నాయి.

సంక్రాంతి సీజన్ ని మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మూవీస్ రిలీజ్ బట్టి చెప్పొచ్చు. అయితే సంక్రాంతి వచ్చేనాటికి వీటిలో కొన్ని వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. అన్ని సినిమాలు ఒకేసారి అంటే సక్సెస్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ లో రావు. ఈ నేపథ్యంలో నిర్మాతలు సయోధ్యతో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుందని అంచా వేస్తున్నారు.

ఈ సంక్రాంతి ఇలా వచ్చే 2025 సంక్రాంతికి కూడా ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ కావడంతో షూటింగ్ వేగంగా కంప్లీట్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది.

అందుకే వశిష్ట మల్లిడి 2025 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రాన్ని రెడీ చేయాలని అనుకుంటున్నారు. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో డార్లింగ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. మేకింగ్ ఫోటోలు అప్పుడప్పుడు బయటకొస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.

ఈ ఏడాది ఆఖరులో సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. తరువాత నాగ్ అశ్విన్ చేస్తోన్న కల్కి మూవీ రిలీజ్ కానుంది. నెక్స్ట్ సలార్ పార్ట్ 2 కూడా వచ్చే ఏడాది రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఇవన్ని వచ్చిన తర్వాతనే మారుతి తన సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే 2025 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.